టెక్ న్యూస్ [ 25/04/2020 - 27/04/2020]


daily-tech-news-in-telugu#1. Samsung ను వెనక్కు నెట్టేసిన వివో

xiaomi-vivo-samsung-realme-oppo


ఇండియా లో 2020 మొదటి త్రైమాసికంలో Samsung ను మూడవ స్థానానికి నెట్టివేసి వివో కంపెనీ స్మార్ట్ ఫోన్స్ అమ్మకాలలో రెండవ స్థానానికి వచ్చింది.Xiaomi కంపెనీ ఎప్పుడు లాగానే తన మొదటి స్థానాన్ని పదిలపరుచుకుంది.గణాంకాలను చూస్తే ఇండియాలో 2020 మొదటి త్రైమాసికంలో Xiaomi 33 మిలియన్ల యూనిట్స్ ను షిప్ చేయగా.. వివో మరియు Samsung వరుసగా 6.7, 6.3 మిలియన్ల యూనిట్స్ ను షిప్ చేశాయి.ఇక Realme మరియు Oppo నాలుగు మరియు అయిదవ స్థానాల్లో నిలిచాయి.


#2. MIUI 12 ను లాంచ్ చేసిన Xiaomi Xiaomi తన యొక్క సొంత UI MIUI వెర్షన్ 12 ను ఈరోజు లాంచ్ చేసింది.ఈ లాంచ్ ఈవెంట్ చైనాలో జరిగింది.ఈ ఈవెంట్ లో కంపెనీ Mi 10 యూత్ ఎడిషన్ 5జి  ఫోన్ ను కూడా లాంచ్ చేసింది.దీన్ని బట్టి MIUI 12 తో వస్తున్నమొదటి ఫోన్ ఇదే కానున్నది.కానీ,ఈ ఫోన్ చైనా వరకే పరిమితం అయ్యే అవకాశం వుంది.అలాగే క్రొత్త MIUI వెర్షన్ మాత్రం మునుపటి లాగానే అన్ని మర్కెట్స్ లో అందుబాటులోకి వస్తుంది.

ఈ క్రొత్త MIUI 12 లో కంపెనీ సెక్యూరిటీ ,హెల్త్,డిజైన్ పరంగా ఎన్నో క్రొత్త  ఫీచర్స్ ను తీసుకువచ్చింది.వీటిలో AI కాలింగ్ ,క్రొత్త నావిగేషన్ గెస్చర్స్,ఫ్లేర్ మరియు మాస్క్ సిస్టం వంటి క్రొత్త ఉపయోగకరమయిన ప్రైవసీ మరియు సెక్యూరిటీ ఫీచర్లు ,మల్టీ విండో మరియు పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ లో కొన్ని మార్పులు ,in-built స్లీప్ ట్రాకర్ ముఖ్యమయినవి.ఈ క్రొత్త వెర్షన్ కి ఏ ఏ డివైస్ లు ఎలిజిబుల్ అవుతాయో మేము ఈ బ్లాగ్ లో త్వరలోనే ఒక ఆర్టికల్ ద్వారా వెల్లడిస్తాము.#3. ఐడియా వోడాఫోన్ వినియోగదారులకు శుభవార్త..ఇప్పుడు ఈ ప్యాక్స్ తో డబుల్ డేటాను పొందండి.


vodafone-idea


వోడాఫోన్ ఐడియా మరికొన్ని డబుల్ డేటా ప్యాక్స్ ను లాంచ్ చేసింది.ఇవి కేవలం కొన్ని సర్కిల్స్ లో మాత్రమే లభిస్తున్నాయి.ఐడియా,వోడాఫోన్ వెబ్సైట్స్ ను పరిశీలించిన పిమ్మట 2 GB డేటా ను అందించే ప్యాక్స్ రూ.299, రూ.449 మరియు రూ.699 ఇప్పుడు రెట్టింపు డేటా ను అందిస్తాయి.అనగా మీరు ఈ ప్యాక్స్ తో రీఛార్జ్ చేసుకుంటే మీరు రోజుకు 4 GB డేటాను ప్యాక్ వాలిడిటీ ముగిసే వరకు పొందగలరు.అలాగే రూ.399, రూ.599 తో రీఛార్జ్ చేసుకుంటే మీరు రోజుకు 1.5 డేటా తో పాటు ఇంకొక 1.5 డేటా ఉచితంగా పొందవచ్చు.ఈ ప్యాక్స్ ఆంధ్ర ప్రదేశ్ మరియి తెలంగాణ సర్కిల్స్ లో కూడా అందుబాటులో ఉన్నట్లు Active Amaravati స్వయంగా చేసిన ఇన్వెస్టిగేషన్ లో వెల్లడయ్యింది.


#4. రియల్ మీ X2 ప్రో కు ఇండియాలో సాఫ్ట్ వేర్ అప్డేట్ వచ్చింది


రియల్ మీ X2 ప్రో కి ఇండియాలో సాఫ్ట్ వేర్ అప్డేట్ వచ్చింది అని సమాచారం.ఈ ఫోన్ కు మార్చ్ నెలలో ఆండ్రాయిడ్ 10 మీద నడిచే రియల్ మీ UI  కి సంభందించిన సాఫ్ట్ వేర్ అప్డేట్ రావడం జరిగింది.ఇప్పుడు వచ్చిన ఈ అప్డేట్ లో మునుపటి అప్డేట్ లో వున్న బగ్స్ ను సరిచేస్తూ కొన్ని క్రొత్త ఫీచర్స్ ను తీసుకువచ్చారు.అలాగే దీనిలో ఏప్రిల్ 2020 నెల సెక్యూరిటీ ప్యాచ్ కూడా వుంది.ఈ అప్డేట్ యొక్క వెర్షన్ RMX1931EX_11.C.25 గా వుంది.ఈ అప్డేట్ ను దశల వారీగా రోల్ అవుట్ చేస్తున్నారు.ఈ అప్డేట్ లో ఎలాంటి సమస్యలా లేదు అని అనిపించిన పిమ్మట అన్ని డివైస్ లకు రోల్ అవుట్ చేస్తాము అని కంపెనీ వారు అన్నారు.


#5. మోటోరోలా ఎడ్జ్+ త్వరలో ఇండియాలో లాంచ్ అవుతుంది:ప్రశాంత్ మని 


Amitorola-edge-plus

మోటోరోలా ఎడ్జ్+ త్వరలో ఇండియాలో లాంచ్ అవుతుంది అని మోటోరోలా ఇండియా హెడ్ ప్రశాంత్ మని అన్నారు.ఈ మోటోరోలాగా ఎడ్జ్ సిరీస్ కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చెయ్యబడింది.మొదట అనౌన్స్ చేసిన సమయంలో ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో వస్తుంది చెప్పలేదు.కానీ ఇప్పుడు మోటోరోలా హెడ్ చేసిన ట్వీట్ ద్వారా ఈ ఎడ్జ్ సిరీస్ లోని మోటోరోలా ఎడ్జ్  ప్లస్ ఇండియాలో కూడా లాంచ్ అవుతుంది అని తెలుస్తుంది.ఇది 108 మెగా పిక్సెల్ రియర్ ప్రైమరీ కెమెరా,స్నాప్ డ్రాగన్ 865 చిప్ సెట్ ని కలిగి ఉంటుంది.దీని ధర ఇండియాలో ఎంత ఉంటుందో ఇంకా తెలియాల్సి వుంది.


#6. వన్ ప్లస్ 8 ప్రో కు ఆక్సిజన్ OS 10.5.5 అప్డేట్ వచ్చింది

వన్ ప్లస్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ కు ఆక్సిజన్ OS 10.5.5 అప్డేట్ గ్లోబల్ గా రోల్ అవుట్ అయ్యింది.ఈ అప్డేట్ లో ఫోన్లోని కొన్ని బగ్స్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.వన్ ప్లస్ 8 ప్రో డిస్ప్లే లోని గ్రీన్ tint సమస్యను ఈ అప్డేట్ పరిష్కరిస్తుంది అని సమాచారం.కానీ ఆఫిసియల్ చేంజ్ లాగ్ లో మాత్రం దీని గురించి ప్రస్తావించలేదు.కేవలం ఆప్టిమైజ్డ్ డిస్ప్లే ఎఫెక్ట్స్ అని మాత్రమే వుంది.పూర్తి చేంజ్ లాగ్ ను మీరు ఈ క్రింద చూడవచ్చు.

oxygen-os-10.5.5-change-log

#7. రియల్ మీ TV కు ఇండియాలో ఆండ్రాయిడ్ టీవీ సర్టిఫికేషన్ వచ్చింది.


realme-tv
Image may be vary from original

రియల్ మీ టీవీ కు ఇండియాలో ఆండ్రాయిడ్ టీవీ సర్టిఫికేషన్ పొందినట్లు ట్విట్టర్ లో లభిస్తున్న కొన్ని లీక్స్ ద్వారా తెలుస్తుంది.ట్విట్టర్ లో పోస్ట్ చేసిన దాదాపు నమ్మదగ్గ రూమర్స్ ప్రకారం ఈ విషయం తెలుస్తుంది.ఈ రియల్ మీ టీవీ లో Mstar T16 SoC ను వాడినట్లు కూడా లీక్స్ లో వున్న స్క్రీన్ షాట్ ద్వారా వ్యక్తం అవుతుంది.ఇండియాలో ప్రస్తుతం వున్న లాక్ డౌన్ ను ఎత్తివేసిన తరువాత ఈ రియల్ మీ టీవీ ను లాంచ్ చేసే ఆస్కారం వుంది.

Read Also: టెక్ న్యూస్- 2


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది