టెక్ న్యూస్ [28/04/2020 నుండి 30/04/2020]

daily-tech-news-in-telugu
#1. జియో నుంచి ఫ్రీ డేటా!


jio-free-data

ప్రఖ్యాత టెలికాం సంస్థ జియో, 2GB ఫ్రీ డేటా ను కొంతమంది వినియోగదారులకు అందిస్తుంది అని సమాచారం.జియో వినియోగదారులు దీని ద్వారా రోజుకి 2GB డేటా ను నాలుగు రోజుల పాటు ఉచితంగా పొందవచ్చు.ఈ బెనిఫిట్ కు మీరు అర్హులయ్యారో లేదా జియో అప్లికేషన్ లోని మై ప్లన్స్ సెక్షన్ కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు.ఈ ఆఫర్ Jio Data Pack అనే పేరు తో ఉంటుంది. ఈ బెనిఫిట్ కు వినియోగదారులను ఏ అర్హతతో సెలెక్ట్ చేశారో ఇంకా తెలియరాలేదు.జియో టెలికాం రంగంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఫ్రీ డేటా ఆఫర్స్ ఎన్నో సార్లు యివ్వటం గమనార్హం.


#2. నోకియా 6.2 కు ఆండ్రాయిడ్ 10 అప్డేట్ వచ్చింది 

nokia-6.2


నోకియా 6.2 కు ఇండియాలో ఆండ్రాయిడ్ 10 ఆధారిత సాఫ్ట్ వేర్ అప్డేట్ వస్తుంది అని సమాచారం. ఈ అప్డేట్ లో ఆండ్రాయిడ్ 10 తో పాటు మార్చ్ నెల సెక్యూరిటీ ప్యాచ్ కూడా వుంది. మీరు ఈ ఫోన్ ను వాడుతున్న యెడల సెట్టింగ్స్ లోకి వెళ్లి అప్డేట్ ను చెక్ చేసుకోగలరు.ఈ సాఫ్ట్ వేర్ అప్డేట్ యొక్క వెర్షన్ 2.290 గా మరియు సైజు 1.5GB గా వుంది.ఈ స్మార్ట్ ఫోన్ 2019 అక్టోబర్ లో ఇండియాలో విడుదల అయ్యింది.


#3. LG వెల్వెట్ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ 


lg-velvet

LG  వెల్వెట్ స్మార్ట్ ఫోన్ మే 7 న ఆన్లైన్ ఈవెంట్ ద్వారా లాంచ్ కానున్నది.ఈ ఫోన్ 6.8 FHD+ OLED  తెరతో వస్తుంది.దీనిలో Qualcomm స్నాప్ డ్రాగన్ 765G ప్రాసెసర్ ను ఉపయోగించారు.దీనిలో వెనుక భాగాన మూడు కెమెరాలను (48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ +5 మెగా పిక్సెల్ )అమర్చారు.ముందు భాగాన సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ కెమెరాను ఉపయోగించారు.5G సపోర్ట్ కలిగిన ఈ LG వెల్వెట్ స్మార్ట్ ఫోన్ 4300mAh బ్యాటరీ తో 10W వైర్ లెస్ ఛార్జింగ్ టెక్ తో వస్తుంది.ముందు చెప్పుకున్నట్లు ఇది మే 7 న ఆన్లైన్ ఈవెంట్ ద్వారా లాంచ్ అవుతుంది.భారత కాలమానం ప్రకారం ఈ ఈవెంట్ మే 7 న ఉదయం 6.30 కు మొదలుకానున్నది.


#4. టిక్ టాక్ 2 బిలియన్ల డౌన్లోడ్స్ ను చేరుకుంది.


టిక్ టాక్ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ (యాప్ స్టోర్ +ప్లే స్టోర్) ప్రపంచ వ్యాప్తంగా 2 బిలియన్ల మార్క్ క్రాస్ అయ్యింది.ఈ గణాంకాలలో ఇండియా 611 మిలియన్స్ ఇన్స్టాల్ తో మొదటి స్థానం లో నిలవగా చైనా (196.6 మిలియన్స్), యునైటెడ్ స్టేట్స్(165 మిలియన్స్) రెండవ మరియు మూడవ స్థానాల్లో నిలిచాయి.

కరోనా నేపథ్యంలో వివిధ దేశాల్లో విధించబడిన లాక్ డౌన్ తో బైట్ డాన్స్ కు సంభందించిన ఈ అప్లికేషన్ ను ఎక్కువగా ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఈ లెక్కలు కేవలం Official గా ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్స్ కి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే చాలా మంది ప్రజలు సేఫ్ కాదు అని తెలిసి కూడా థర్డ్ పార్టీ సైట్స్ నుండి కూడా ఆండ్రాయిడ్ యాప్స్ ను డౌన్లోడ్ చేసుకుంటారు కదా..!


#5. ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా అప్లికేషన్ లో మల్టీ డివైస్ సపోర్ట్ ఆనవాళ్లు..!


whatsapp-icon

ఆండ్రాయిడ్ వాట్సాప్ అప్లికేషన్ లో మల్టీ డివైస్ సపోర్ట్ కి సంభందించిన ఆనవాళ్లు కనపడినట్లు తెలుస్తుంది.ఈ ఫీచర్ కి సంభందించిన కోడింగ్ ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వెర్షన్ 2.20.143 లో వుంది.ఈ మల్టీ డివైస్ ఫీచర్ మీద వాట్సాప్ ఎంతో కాలం నుండి వర్క్ చేస్తుంది.ఈ ఫీచర్ ద్వారా మీరు ఒక నెంబర్ మీద రిజిస్టర్ అయివున్న వాట్సాప్ అకౌంట్ ను ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ డివైస్ లలో ఎలాంటి సమస్యలు లేకుండా వాడుకోవచ్చు.

ప్రస్తుతం ఒక వాట్సాప్ అకౌంట్ ను కేవలం ఒక డివైస్ లేదా డివైస్+వాట్సాప్ వెబ్ ద్వారా మాత్రమే యాక్సిస్ చేయగలము.కానీ ఈ ఫీచర్ వచ్చినట్లు అయితే మనము ఒకటి కంటే ఎక్కువ డివైస్ లలో ఒకేసారి ఎలాంటి డిస్ కనెక్ట్ సమస్యలు లేకుండా వాట్సాప్ అకౌంట్ ను ఉపయోగించుకోవచ్చు.


#6. ఫేస్ బుక్ లో క్రొత్త రియాక్షన్!

facebook-care-reaction


కరోనా నేపథ్యంలో మన ఆత్మీయులకు మన కేరింగ్ ను తెలుపుటకు ఫేస్ బుక్ ఒక క్రొత్త కేర్ రియాక్షన్ ను తీసుకురాబోతుంది అని ఈ  బ్లాగ్ లో ఇంతకు ముందు చెప్పుకోవడం జరిగింది.ఇప్పుడు ఈ కేర్ రియాక్షన్ ఫేస్ బుక్ లో రోల్ ఔట్ చెయ్యటం జరిగింది.

ఎప్పుడు లాగానే మీరు ఏదయినా పోస్ట్,కామెంట్ కు లైక్ సింబల్ ను హోల్డ్ చేయగానే మీకు ఇది వరకు ఉన్న రియాక్షన్స్ తో పాటు అదనంగా పైన చూపబడిన రియాక్షన్ ను కూడా గమనించగలరు.ఒకవేళ మీకు కనుక ఈ రియాక్షన్ రాకపోతే ఏమి కంగారు పడనవసరం లేదు.మీకు కూడా త్వరలో ఈ రియాక్షన్ రోల్ అవుట్ అవుతుంది.అలానే మీరు ఫేస్ బుక్ అప్లికేషన్ ను అప్డేట్ గా ఉంచుకోవడం మర్చిపోవద్దు.


Read Also: ఆండ్రాయిడ్ ఫేస్ బుక్ అప్లికేషన్ లోని లింక్స్ ను మీ డిఫాల్ట్ బ్రోజర్ లో ఓపెన్ అయ్యేలా చెయ్యటం ఎలా?


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది