WhatsApp may Soon Increase Participants In Group Video and Audio Calls


WhatsApp icon

వివిధ సోషల్ మీడియా అప్లికేషన్స్ లలో వాట్సాప్ ఎంతో ప్రసిద్ధి చెందింది.మొదట వాట్సాప్ లో ఎక్కువ అభివృద్ధి లేకపోయినా  ఫేస్ బుక్ సంస్థ దీనిని సొంతం చేసుకున్నప్పటినుండి వాట్సాప్ లో వివిధ అద్భుతమయిన ఫీచర్స్ వస్తున్నాయి. వాటిలో ఈ మధ్య వచ్చిన డార్క్ మోడ్ మరియు ఫింగర్ ప్రింట్ అన్ లాక్ ముఖ్యమయినవి.

ఇది ఇలాగు ఉండగా వాట్సప్ త్వరలో ఇంకొక సదుపాయాన్ని అందించబోతుంది అని తెలుస్తుంది..అదే వాట్సాప్ వీడియో,ఆడియో కాల్స్ లో పాల్గొనే సభ్యుల పరిమితిని పెంచటం..!

సాధారణంగా ప్రస్తుతం వాట్సాప్ గ్రూప్ కాల్స్ లో గరిష్టంగా నలుగురు వ్యక్తులు మాత్రమే పాల్గొనే సదుపాయం వుంది.అయితే ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వెర్షన్ 2.20.128 లో అంతర్గత కోడింగ్ ద్వారా ఈ పరిమితిని వాట్సాప్ పెంచబోతుంది అని తెలుస్తుంది.ఈ ఫీచర్ ను పొందటానికి యూజర్స్ అందరూ లేటెస్ట్ వెర్షన్ వాట్సాప్ ను ఉపయోగించాల్సి వుంది అని కూడా ఈ అంతర్గత కోడ్ ద్వారా స్పష్టం అవుతోంది.

అయితే ఈ ఫీచర్ ఎప్పుడు వస్తుంది?ఈ క్రొత్త సదుపాయం ద్వారా గరిష్టంగా ఎంత మంది పార్టిసిపెంట్స్ పాల్గొనవచ్చు? అనే విషయం ఇంకా తెలియరాలేదు.

దీనితో పాటు వాట్సాప్ లోని కాల్ హెడర్ లో ఒక క్రొత్త End-to-end encrypted అనే స్ట్రింగ్ ను కూడా పొందుపరుస్తున్నట్లు తెలుస్తుంది.ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వెర్షన్ 2.20.129 లో లభిస్తుంది.


whatsapp beta 2.2.129 for android
Image Source:WABetaInfo

ఇటీవల ఆన్లైన్ లో రిపోర్ట్స్ తో సహా బయటపడుతున్న జూమ్ అప్లికేషన్ యొక్క సెక్యూరిటీ లోపాలు చూసి ప్రజలు జూమ్ కి ప్రత్యామ్నాయాలు కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ క్రొత్త వాట్సాప్ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చినట్లు అయితే అందరూ వాట్సాప్ నే ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్ అప్లికేషన్ గా ఉపయోగించే ఆస్కారం లేకపోలేదు.


Read Also: గూగులే క్రోమ్ బ్రౌజర్ లోని టెక్స్ట్ సైజు ను పెంచుకునేందుకు సులభమైన పద్దతి..!


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది