Infinix Hot 9 Series Smartphones Launched in India: Price, Specifications, Features in Telugu


Infinix Hot 9 Series Smartphones Launched in India: Price, Specifications, Features in Telugu

Infinix Hot 9 మరియు Infinix Hot 9 ప్రో స్మార్ట్ ఫోన్స్ మే 29 న ఇండియాలో లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్స్ కూడా 6.6 అంగుళాల HD+(720x1600 పిక్సల్స్) హోల్ పంచ్ IPS LCD తెరతో, మీడియా టెక్ హీలియో P22 ప్రాసెసర్ తో వస్తున్నాయి. ఈ ఫోన్స్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ను మీరు ఈ క్రింద చదవవచ్చు.

Infinix Hot 9 మరియు Infinix Hot 9 ప్రో ధర(ఇండియా):

Infinix Hot 9 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 8,499(4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్) కు మరియు Infinix Hot 9 ప్రో స్మార్ట్ ఫోన్ రూ. 9,499 (4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్) కు లభిస్తుంది. ఈ రెండు ఫోన్స్ కూడా ఓషన్ బ్లూ మరియు వయొలెట్ కలర్స్ లో లభిస్తున్నాయి. 

Infinix Hot 9 ప్రో మొదటి సేల్ జూన్ 5 న మధ్యాహ్నం 12 గంటలకు మరియు Infinix Hot 9 సేల్ జూన్ 8 న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ ద్వారా జరుగనున్నది.

Infinix Hot 9, Infinix Hot 9 ప్రో స్పెసిఫికేషన్స్:

ఈ రెండు ఫోన్స్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత XOS 6.0 మీద నడుస్తున్నాయి. ఇవి 6.6 అంగుళాల HD+(720x1600 పిక్సల్స్) హోల్ పంచ్ IPS LCD తెరతో, 20:9 aspect రేషియో తో, 90.5 స్క్రీన్ టూ బాడీ రేషియో తో, గరిష్టంగా 480 నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తున్నాయి.

ఈ రెండు ఫోన్స్ కూడా octa-core మీడియా టెక్ హీలియో P22 ప్రాసెసర్ తో వస్తున్నాయి.

ముందుగా చెప్పుకున్నట్లు గానే ఈ ఫోన్స్ 4జీబీ RAM తో 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తున్నాయి. మీరు స్టోరేజ్ ను డెడికేటెడ్ స్లాట్ ద్వారా microSD కార్డు ను వుపయోగించి 256జీబీ వరకు పెంచుకోవచ్చు.

కెమెరా పరంగా చూస్తే ప్రో వేరియంట్ వెనుక భాగాన మొత్తం నాలుగు కెమెరాలను (48-మెగాపిక్సల్ ప్రైమరీ , 2-మెగాపిక్సల్ మాక్రో లెన్స్, 2-మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, లో లైట్ కెమెరా) గమనించవచ్చు. దీని ముందు భాగాన 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఉపయోగించారు.

ఇక సాధారణ వేరియంట్ వెనుక భాగాన నాలుగు కెమెరాలను(13-మెగాపిక్సల్ ప్రైమరీ,2-మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, 2-మెగాపిక్సల్ మాక్రో లెన్స్, లో లైట్ కెమెరా) గమనించవచ్చు. దీని  ముందు భాగాన 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఉపయోగించారు.

కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్స్ బ్లూ టూత్ v5, 3.5mm ఆడియో జాక్, USB OTG, Wi-Fi 802.11a/b/g/n, GPS/A-GPS మరియు మైక్రో USB సపోర్ట్ తో వస్తున్నాయి.

వీటిలో యాక్సిలెరోమీటర్, గైరో స్కోప్, ఈ-కంపాస్, లైట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్(వెనుక భాగాన) మరియు ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి మొదలయిన సెన్సార్లు వున్నాయి. ఈ రెండు ఫోన్ లలో 5000mAh బ్యాటరీ ను ఉపయోగించారు. 

ఈ రెండు ఫోన్స్ DTS సరౌండ్ సౌండ్ టెక్నాలజీ తో వస్తున్నాయి. 


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు టెలిగ్రామ్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది