Realme Narzo 10, Realme Narzo 10A Price in India, Specifications, Features and more in Telugu  


Realme Narzo 10, Realme Narzo 10A Smartphones comes with 6.5- inch display, 5000mAh battery. Realme Narzo 10 is powered by MediaTek Helio G80 SoC whereas Realme Narzo 10A has MediaTek G70 SoC. Below is the Price in India, Specifications and more.


Realme Narzo 10, Realme Narzo 10A Price in India, Specifications, Features and more in Telugu

Realme Narzo 10 మరియు Realme Narzo 10A స్మార్ట్ ఫోన్స్ ఇండియాలో మే 11 న లాంచ్ అయ్యాయి. మామూలుగా ఈ ఫోన్స్ మార్చ్ నెలలోనే లాంచ్ కావలసివుండగా లాక్ డౌన్ వల్ల సాధ్యపడలేదు.

అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్రీన్ మరియు ఆరంజ్ జోన్స్ లో ఆంక్షలు సడలించిన నేపథ్యంలో కంపెనీ ఈ ఫోన్స్ ను లాంచ్ చెయ్యడానికి పూనుకుంది. Realme Narzo 10 మరియు Realme Narzo 10A 6.5 అంగుళాల తెరతో, 5000mAh బ్యాటరీ తో, Realme UI తో వస్తున్నాయి. వీటి ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ను మీరు ఈ క్రింద చదవవచ్చు.


Realme Narzo 10, Realme Narzo 10A ధర (ఇండియా)

Realme Narzo 10 స్మార్ ఫోన్ కేవలం 4GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ లో వస్తుంది. దీని ధరను రూ. 11,999 గా సెట్ చేసారు. ఈ స్మార్ట్ ఫోన్ That Green, That White అనే రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme Narzo 10A స్మార్ట్ ఫోన్ 3GB RAM+32GB స్టోరేజ్ వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది. దీని ధర ను రూ. 8,499 గా సెట్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ So Blue మరియు So White అనే రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme Narzo 10 యొక్క మొదటి సేల్ మే 18 న మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది. అలానే Realme Narzo 10A స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ మే 22 న మధ్యాహ్నం 12 గంటలకు జరుగనున్నది.

ఈ రెండు ఫోన్స్ ఫ్లిప్ కార్ట్, realme.com వెబ్సైట్స్ ద్వారా లభిస్తాయి.



Realme Narzo 10 స్పెసిఫికేషన్స్

Realme Narzo 10, Realme Narzo 10A Price in India, Specifications, Features and more in Telugu


ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత Realme UI తో నడుస్తుంది. ఇది 6.5 అంగుళాల HD+ Mini-Drop తెరతో, 89.8 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో తో, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది.

దీనిలో మీడియా MediaTek Helio G80 చిప్ సెట్, Mali G52 GPU ను ఉపయోగించారు. 

దీనిలో వెనుక భాగాన మొత్తం నాలుగు ( 48 మెగాపిక్సల్ ప్రైమరీ, 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సల్ బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రైట్, 2 మెగాపిక్సల్ మాక్రో ) కెమెరాలు వున్నాయి. దీని ముందు భాగాన 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను గమనించవచ్చు.

ముందుగా చెప్పుకున్నట్లు ఇది 4GB LPDDR4x RAM తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

కనెక్టివిటీ పరంగా దీనిలో 4G LTE, Wi-Fi 802.11 b/g/n, బ్లూ టూత్ 5.0. GPS/A-GPS మరియు USB Type-C పోర్ట్ మొదలయినవి వున్నాయి. 

దీనిలో యాక్సిలెరోమీటర్, లైట్, గైరో స్కోప్, మాగ్నెటోమీటర్ మరియు ప్రాక్సిమిటీ మొదలయిన సెన్సార్లు వున్నాయి. దీనిలో వెనుకభాగాన ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వుంది.

ఇక ఇది 5000mAh బ్యాటరీ తో, 18W క్విక్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. మీరు 18W క్విక్ చార్జర్ ను విడిగా కొననవసరం లేకుండా కంపెనీ వారు మొబైల్ తో పాటే అందిస్తారు.


Realme Narzo 10A స్పెసిఫికేషన్స్


Realme Narzo 10, Realme Narzo 10A Price in India, Specifications, Features and more in Telugu

Realme Narzo 10A ఆండ్రాయిడ్ 10 ఆధారిత Realme UI తో, 6.5 అంగుళాల తెరతో, 89.8 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో తో, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది.

దీనిలో MediaTek G70 ప్రాసెసర్ ను, Mali G52 GPU ను ఉపయోగించారు.

కెమెరా పరంగా దీనిలో వెనుక భాగాన 12 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సల్ పోర్ట్రైట్, 2 మెగాపిక్సల్ మాక్రో అనే మూడు కెమెరాలను అమర్చారు. దీని ముందుభాగాన 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను గమనించవచ్చు.

ఇది 3GB RAM తో, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. మీరు స్టోరేజ్ ను microSD కార్డు ద్వారా 256GB వరకు పెంచుకోవచ్చు.

దీనిలో యాక్సిలెరోమీటర్,  లైట్, మాగ్నెటోమీటర్ మరియు ప్రాక్సిమిటీ మొదలయిన సెన్సార్లు వున్నాయి. దీనిలో కూడా వెనుక భాగాన ఫింగర్ ప్రింట్ సెన్సార్ వుంది.

కనెక్టివిటీ పరంగా దీనిలో 4G LTE, Wi-Fi 802.11 b/g/n, బ్లూ టూత్ 5.0, GPS/A-GPS, 3.5 mm హెడ్ ఫోన్ జాక్ మరియు మైక్రో USB పోర్ట్ మొదలయినవి వున్నాయి. 

దీనిలో 5000mAh బ్యాటరీ ను ఉపయోగించారు.ఇది రివర్స్ ఛార్జింగ్ కు సపోర్ట్ ను ఇస్తుంది.



Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది