Realme Watch Launched in India For Rs. 3,999. Price, Specifications and Features in Telugu


Realme Watch Launched in India For Rs. 3,999. Price, Specifications and Features in Telugu


Realme మే 25 న ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న Realme TV, Realme Watch తో పాటు Realme Buds Air Neo ను మరియు Realme Power Bank 2 ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ లాంచ్ ఈవెంట్ ఆన్లైన్ ద్వారా జరిగింది. ఇప్పుడు మనము Realme Watch యొక్క స్పెసిఫికేషన్స్ ను మరియు ధరను చూద్దాం.

Realme Watch ధర ఇండియాలో రూ. 3,999 కు సెట్ చేశారు. ఈ స్మార్ట్ వాచ్ ఇండియాలో ఫ్లిప్ కార్ట్ మరియు రియల్ మీ ఆన్లైన్ స్టోర్ ద్వారా జూన్ 5 మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి రానున్నది. ఆన్లైన్ సేల్ మొదలయిన కొన్ని రోజుల తరువాత ఇది ఆఫ్ లైన్ స్టోర్స్ లలో కూడా లభించనున్నది. Realme Watch మొత్తం నాలుగు స్ట్రాప్ కలర్స్ (బ్లాక్,రెడ్, బ్లూ, గ్రీన్)  లలో వస్తుంది. 

Realme Watch 1.4  అంగుళాల (320 x 320 పిక్సల్స్) టచ్ స్క్రీన్ కలర్ డిస్ప్లే తో, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో, 3-యాక్సిస్ యాక్సిలెరోమీటర్, PPG సెన్సార్, IP68 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇది మొత్తం 12 వాచ్ ఫేసెస్ తో వస్తుంది. ఇవే కాక మీరు 100 కు పైగా వాచ్ ఫేసెస్ ను OTA అప్డేట్ లో పొందవచ్చు అని కంపెనీ అంటుంది. 

ఇక ఇది 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్ తో పాటు బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మానిటరింగ్ తో కూడా వస్తుంది.

Realme Watch Launched in India For Rs. 3,999. Price, Specifications and Features in Telugu


ఈ వాచ్ క్రికెట్, బాడ్మింటన్, ఇన్డోర్ రన్, అవుట్ డోర్ రన్, వాకింగ్, యోగా, ట్రెడ్ మిల్ వంటి మొత్తం 14 రకాల స్పోర్ట్స్ మోడ్స్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ స్లీప్ మానిటరింగ్, ideal అలెర్ట్స్ , మెడిటేషన్ రిమైండర్లు, స్టెప్ కౌంట్, క్యాలరీ కౌంట్ ను కూడా కలిగి వుంది. 

Realme Watch Launched in India For Rs. 3,999. Price, Specifications and Features in Telugu

Realme Watch లో వినియోగదారులు పలురకాల అప్లికేషన్స్ కు సంభంధించిన నోటిఫికేషన్స్ ను, SMS మరియు కాల్ నోటిఫికేషన్స్ ను పొందవచ్చు. మీరు ఈ స్మార్ట్ వాచ్ లో కేవలం కాల్స్ ను రిజెక్ట్ లేదా మ్యూట్ మాత్రమే చెయ్యగలరు. 

అలానే ఈ స్మార్ట్ వాచ్ తో మీరు మ్యూజిక్ మరియు కెమేరా ను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు ఈ స్మార్ట్ వాచ్ ను ప్లే స్టోర్ లో లభించే Realme Link అనే అప్లికేషన్ తో కనెక్ట్ చేసుకోవాలి.

దీనిలో వాతావరణ వివరాలు, అలారం, లో బ్యాటరీ రిమైండర్ వంటి అనేక అదనపు ఫీచర్స్ కూడా ఉన్నాయి.

Realme Watch Launched in India For Rs. 3,999. Price, Specifications and Features in Telugu

Realme Watch బ్లూ టూత్ 5.0 తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్ వెర్షన్ లేదా ఆపైన నడుస్తున్న అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ కు సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్ 160mAh బ్యాటరీ తో వస్తుంది. కంపెనీ చెప్పినదాని ప్రకారం ఈ స్మార్ట్ వాచ్ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 7 రోజుల బ్యాటరీ (కంటిన్యూస్ హార్ట్ రేట్ మానిటర్ ను ఆన్ చేస్తే) ను పొందగలరు. అలానే దీనిలోని పవర్ సేవింగ్ మోడ్ ను ఆన్ చేస్తే మీరు ఒక్క ఫుల్ ఛార్జ్ తో దాదాపు 20 రోజుల బ్యాటరీ ను పొందవచ్చు.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది