టెక్ న్యూస్ [ 01/05/2020 - 03/05/2020]


daily-tech-news-in-telugu#1. రిలయన్స్ జియో JioMeet ను ప్రకటించింది


కరోనా నేపథ్యంలో పెరిగిన జూమ్,గూగుల్ మీట్ వంటి వివిధ వీడియో కాన్ఫరెన్స్ అప్లికేషన్స్ తో పోటీ పడుటకు రిలయన్స్ జియో ఒక సరిక్రొత్త వీడియో కాన్ఫరెన్స్ ప్లాట్ ఫార్మ్ ను అనౌన్స్ చేసింది అదే - జియో మీట్JioMeet ను రిలయన్స్ ప్రకటించిన తరువాత దీనికి సంభంధించిన అప్లికేషన్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ లలో కనపడింది.కానీ ప్రస్తుతానికి కంపెనీ ఈ అప్లికేషన్ ను వీటినుండి తొలగించింది.

JioMeet వెబ్ సైట్ హోమ్ పేజీ లో ప్రస్తుతం Thank you for your interest in JioMeet అని వుంది.

ఇక దీని ఫీచర్స్ ను చూస్తే దీనిలో కూడా జూమ్ మాదిరిగా గరిష్టంగా 100 మంది దాకా పార్టిసిపెంట్స్ జాయిన్ అవ్వొచ్చు.పార్టిసిపెంట్స్ దీనిలో ఫోన్ నెంబర్ ద్వారా కానీ లేదా ఈమెయిల్ ను వుపయోగించి కానీ రిజిస్టర్ అవ్వొచ్చు.అలానే కాన్ఫరెన్స్ లో జాయిన్ అవ్వాలి అని అనుకున్న యూజర్స్ దీనిలో అకౌంట్ లేకపోయినా సరే లింక్ ద్వారా గెస్ట్ గా జాయిన్ అవ్వొచ్చు.దీని గురించి త్వరలో మేము మరింత సమాచారం అందించే ప్రయత్నం చేస్తాము.


#2. Samsung Galaxy M21 ధర ఇండియాలో తగ్గింది 


samsung-galaxy-m21

Samsung Galaxy M21 స్మార్ట్ ఫోన్ ధర ఇండియాలో తగ్గింది.ఇది మొదట్లో 4GB/64GB ధర రూ. 13,499 కు మరియు 6GB/128GB రూ. 15,499 కు లాంచ్ అయ్యింది.తాజాగా మొబైల్స్ మీద GST పెరగటంతో కంపెనీ దీని 4GB RAM వేరియంట్ ధరను రూ. 14,222 కు మరియు 6GB RAM వేరియంట్ ధరను రూ. 16,499 కు పెంచింది.

కానీ, మరలా దీని ధరను ప్రస్తుతం రూ. 13,199 (4GB/64GB), రూ. 15,499(6GB/128GB) గా సెట్ చేశారు. ఈ ఫోన్ 6.4 అంగుళాల FHD+ సూపర్ AMOLED తెరతో, Exynos 9611 చిప్ సెట్ తో, మూడు (48MP+8MP+5MP) రియర్ కెమెరాలతో, 20MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.ఇది 6000mAh బ్యాటరీను కలిగివుంది.


#3. Samsung Galaxy A50S ధర ఇండియాలో తగ్గింది

samsung-galaxy-a50s

Samsung Galaxy M21 తో పాటుగా Samsung Galaxy A50S స్మార్ట్ ఫోన్ ధర కూడా ఇండియాలో తగ్గింది. ఇటీవల ఇండియన్ గవర్నమెంట్ మొబైల్ ఫోన్స్ మీద GST పెంచటంతో వివిధ కంపెనీలు స్మార్ట్ ఫోన్స్ మీద భారీగా ధరను పెంచాయి.

కానీ ప్రస్తుతం Samsung ఈ ధరలను సవరిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది.ఈ నేపథ్యంలోనే ఈ ఫోన్ యొక్క 4GB/64GB వేరియంట్ ధరను రూ.18,599 గా మరియు  6GB/128GB వేరియంట్ ధరను రూ.20,561 గా సెట్ చేశారు.

Samsung Galaxy A50S స్మార్ట్ ఫోన్ 6.4 అంగుళాల FHD+ సూపర్ AMOLED తెరతో, Exynos 9611 చిప్ సెట్ తో, వెనుక భాగాన మూడు కెమెరాలతో (48MP+8MP+5MP), ముందుభాగాన 32 మెగా పిక్సెల్ కెమెరాతో, 4000mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తో వస్తుంది.


#4. Mi Browser మీద వస్తుంది ఆరోపణలను ఖండించిన షామీ

కొన్ని రోజుల క్రితం ప్రముఖ సెక్యూరిటీ పరిశోధకుడు Gabi Cirlig, షామీ డిఫాల్ట్ బ్రౌజర్ అయిన Mi Browser యూజర్ యొక్క డేటా ను కలెక్ట్ చేసి రిమోట్ సర్వర్లకు చేరవేస్తుంది అని పేర్కొన్నారు.ఈ రిమోట్ సర్వర్ లు సింగపూర్,రష్యా లో వున్నాయి మరియు వాటి డొమైన్స్ బీజింగ్ లో రిజిస్టర్ అయినట్లు సమాచారం.

ఇక్కడ డేటా అనగా మీరు Mi Browser లో విజిట్ చేసిన వెబ్ సైట్స్ హిస్టరీ,URL లు తో పాటు మీరు ఈ బ్రౌజర్ లలో చేసిన వివిధ యాక్టీవిటీ లు కూడా పరిగణలోకి వస్తాయి.ఈ డేటా ను కలెక్ట్ చెయ్యటం Incognito మోడ్ లో వున్నా కూడా జరగటం వారు గమనించారు.

అయితే దీనిని షామీ సంస్థ ఖండించింది.అలానే ఈ రోజు షామీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ Manu Kumar Jain కూడా దీనిని ఖండిస్తూ ఈ రోజు ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.షామీ ఎప్పుడూ యూజర్లు ప్రమేయం లేకుండా ఎలాంటి డేటా ను కలెక్ట్ చెయ్యదు అని మరియు అన్ని ప్రముఖ అప్లికేషన్స్ లాగానే కేవలం క్రాష్ రిపోర్ట్స్ మరియు వివిధ అజ్ఞాత రిపోర్ట్ ను మాత్రమే సేకరించి వాటిని అప్లికేషన్ యొక్క పనితనాన్ని పెంపొందించుకోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటుంది అని అన్నారు.

అలానే భారతీయుల యొక్క Mi బ్రౌజర్ మరియు Mi క్లౌడ్ డేటా మొత్తం ఇండియన్ AWS సర్వర్స్ లో స్టోర్ అవుతుంది అని అన్నారు. Xiaomi కి చెందిన అన్ని బ్రౌజర్లు సురక్షితమే మరియు షామీ యూజర్స్ యొక్క ప్రైవసీ, సెక్యూరిటీకి మొదటి ప్రాధాన్యత యిస్తుంది అని అన్నారు.మరింత సమాచారం కోసం మీరు షామీ చేసిన బ్లాగ్ పోస్ట్ లో చదవవచ్చు.
#5. రియల్ మీ 5 ప్రో,రియల్ మీ XT  కు ఇండియాలో సాఫ్ట్ వేర్ అప్డేట్ వచ్చింది


రియల్ మీ 5 ప్రో మరియు రియల్ మీ XT కు ఇండియాలో సాఫ్ట్ వేర్ అప్డేట్ వచ్చింది అని సమాచారం.ఈ అప్డేట్ ద్వారా ఈ మొబైల్స్ లో వున్న కొన్ని బగ్స్ ను సరిచేస్తూ కొన్ని క్రొత్త ఫీచర్స్ ను కూడా తీసుకువచ్చారు. అలాగే ఈ అప్డేట్స్ లో ఏప్రిల్ 2020 నెల సెక్యూరిటీ ప్యాచ్ కూడా వుంది.

రియల్ మీ 5 ప్రో అప్డేట్ యొక్క వెర్షన్ RMX1971EX_11.C.03 గా ఉండగా,రియల్ మీ XT యొక్క అప్డేట్ వెర్షన్ RMX1921EX_11.C.04 గా వుంది. ఈ అప్డేట్స్ ను కంపెనీ దశల వారీగా రోల్ అవుట్ చేస్తుంది.ఈ అప్డేట్స్ లో ఎలాంటి సమస్యలా లేదు అని అనిపించిన పిమ్మట అన్ని డివైస్ లకు రోల్ అవుట్ చేస్తాము అని కంపెనీ వారు అన్నారు.


#6. Huawei Watch GT 2e త్వరలో ఇండియాలో లాంచ్ అవ్వనున్నది


huawei-watch-gt-2e

Huawei Watch GT 2e ఇండియాలో లాంచ్ అవ్వుటకు సిద్ధంగా వున్నది అని తెలుస్తుంది.దీనికి సంభంధించిన పేజీ ఈ వాచ్ యొక్క ధర మరియు స్పెసిఫికేషన్స్ తో ఫ్లిప్ కార్ట్ లో దర్శనమిచ్చింది. కానీ, కొంతసేపటికి ఈ పేజీ ఫ్లిప్ కార్ట్ నుంచి తొలగించబడింది.దీనికి కారణం ఏమిటో తెలియరాలేదు.

ఈ పేజీ ను తొలగించటానికి ముందు మేము ఈ వాచ్ ధరను పరిశీలించాము.ఫ్లిప్ కార్ట్ లో ప్రచురించిన దాని ప్రకారం దీని ధర ఇండియాలో లో రూ.19,990 గా వుంది. ఇది రెండు వేరియంట్ (ఆక్టివ్ మరియు స్పోర్ట్ )లలో వస్తుంది మరియు వివిధ కలర్ ఆప్షన్స్ లో వస్తుంది.

దీని యొక్క స్పెసిఫికేషన్స్ ను చూస్తే ఇది 1.39 అంగుళాల (454 x 454) AMOLED తెరతో,స్లయిడ్ మరియు గెస్చర్ సపోర్ట్ తో వస్తుంది.దీనిలో యాక్సిలెరోమీటర్, గైరో మీటర్,జియో మాగ్నెటిక్,ఆప్టికల్ హార్ట్ రేట్, Ambient లైట్, ఎయిర్ ప్రెజర్, కెపాసిటివ్ మొదలయిన సెన్సార్లు వున్నాయి.దీనిలో SpO2 సెన్సార్ మరియు GPS కూడా వున్నాయి.ఇది 4జీబీ స్టోరేజ్ తో వస్తుంది మరియు ఇది ఒక్క పూర్తి ఛార్జ్ కు 2 వారాల పాటు బ్యాటరీ ను ఇవ్వగలదు అని కంపెనీ అంటుంది.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది