టెక్ న్యూస్ [ 04/05/2020 - 06/05/2020]


daily-tech-news-in-telugu#1. JioFiber సెట్ టాప్ బాక్స్ లో ఇంకొక OTT అప్లికేషన్ ను ఇంట్రడ్యూస్ చేశారు


amazon-prime-video-on-JioFiber set-top box

JioFiber STB లో SonyLiv, SunNXT, Disney+Hotstar,Voot, Zee5 వంటి చాలా OTT అప్లికేషన్స్ వున్నాయి.ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా చేరింది.కానీ, ఇప్పటికీ ఈ JioFiber లో నెట్ ఫ్లిక్స్ కు సపోర్ట్ లేదు.భవిష్యత్తులో JioFiber లో Netflix ను కూడా ఇంట్రడ్యూస్ చేసే ఆస్కారం వుంది.

అయితే, దీనిలోని అమెజాన్ ప్రైమ్ కంటెంట్ ను యాక్సిస్ చెయ్యటానికి మీరు యధావిధిగా అమెజాన్ ప్రైమ్ వీడియో అకౌంట్ లో సబ్స్క్రిప్షన్ కావాల్సి ఉంటుంది.


#2. గూగుల్ పిక్సెల్ ఫోన్స్ కు సాఫ్ట్ వేర్ అప్డేట్ వచ్చిందిగూగుల్ పిక్సెల్ ఫోన్స్ కు సాఫ్ట్ వేర్ అప్డేట్ వస్తున్నట్లు సమాచారం.ఈ అప్డేట్ వచ్చిన డివైస్ లలో గూగుల్ పిక్సెల్ 2,పిక్సెల్ 3,పిక్సెల్ 3a, పిక్సెల్ 4 సిరీస్ ఫోన్స్ వున్నాయి.

ఈ అప్డేట్ లో కంపెనీ మే 2020 నెల సెక్యురిటీ ప్యాచ్ ను తీసుకువచ్చినట్లు సమాచారం. దీనిలో మోడరేట్ నుండి క్రిటికల్ సెక్యూరిటీ మరియు ప్రైవసీ సమస్యలను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.


#3. Redmi Note 9 Pro సేల్ మరలా మే 7 న జరుగనున్నది


redmi-note-9-pro

Redmi Note 9 Pro యొక్క సేల్ ఈరోజు జరిగిన విషయం తెలిసిందే.మరలా ఈ ఫోన్ యొక్క సేల్ మే 7 న (రేపు) మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ ఇండియా మరియు mi.com ద్వారా జరుగనున్నది.

దీని యొక్క 4GB RAM /64GB స్టోరేజ్ వేరియంట్ రూ. 13,999 కు, 6GB RAM/128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 16,999 కు లభిస్తుంది.

Redmi Note 9 Pro 6.67 అంగుళాల FHD+ IPS తెరతో,స్నాప్ డ్రాగన్ 720G ప్రాసెసర్ తో,వెనుక భాగాన (48MP+8MP+5MP+2MP) అనే నాలుగు కెమెరాలతో, 16 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. దీనిలో 5020mAh బ్యాటరీ ను ఉపయోగించారు మరియు ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.


#4. Mi 10 5G స్మార్ట్ ఫోన్ మే 8 న లాంచ్ కానున్నది

Xiaomi Mi 10 5G ఇండియాలో మే 8 న ఆన్లైన్ ద్వారా లాంచ్ అవ్వనున్నది.చెప్పాలంటే ఈ మొబైల్ ఇండియాలో ఇంతకముందే లాంచ్ కావలసినది.కానీ, లాక్ డౌన్ వల్ల ఈ-కామర్స్ బిజినెస్ మీద పడ్డ ప్రభావం వల్ల ఈ ఫోన్ లాంచ్ కి బ్రేక్ పడింది.అయితే మూడవ ఫేజ్ లాక్ డౌన్ లో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ మరియు ఆరంజ్ జోన్ లలో ఆంక్షలను సడలించిన వేళ ఈ ఫోన్ ను లాంచ్ కు కంపెనీ సన్నద్ధమయ్యింది.

Mi 10 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత MIUI 11 మీద నడుస్తుంది.ఇది 6.67 అంగుళాల FHD+(1080 x 2340 పిక్సల్స్) సూపర్ AMOLED తెర, 90Hz ల రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది.

దీనిలో స్నాప్ డ్రాగన్ 865 చిప్ సెట్ ను, అడ్రెనో 640 జీపీయూ ను ఉపయోగించారు. ఇది 12 జీబీ వరకు RAM ను, 256 జీబీ వరకు ఇంటర్నల్ మెమరీ ను కలిగివుంటుంది.

కెమెరా పరంగా దీనిలో వెనుక భాగాన 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా,2 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా అనే మొత్తం నాలుగు కెమెరాలను అమర్చారు.అలానే ముందుభాగాన 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను గమనించవచ్చు.

ఇక ఇది 4780mAh బ్యాటరీ, 30W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్, 30W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 10W రివర్స్ ఛార్జింగ్ కు సపోర్ట్ ఇవ్వటం గమనార్హం.


#5. Mi ట్రూ వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ ను ఇండియాలో లాంచ్ చెయ్యనున్న షామీ

షామీ కంపెనీ ఇండియాలో మే 8 న ఆన్లైన్ ద్వారా జరిగే లాంచ్ ఈవెంట్ లో Mi 10 5జీ స్మార్ట్ ఫోన్ తో పాటు Mi ట్రూ వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ ను కూడా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తుంది.

Manu Kumar Jain చేసిన ట్వీట్ చూస్తుంటే ఈ వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ Mi True Wireless Earphones 2 గా తెలుస్తుంది.ఇవి ఎయిర్ పోడ్ వంటి డిజైన్ తో,బ్లూ టూత్ 5.0 సపోర్ట్ తో,LHDC బ్లూ టూత్ CODEC తో వస్తున్నాయి.ఇవి ఇండియాలో లో రియల్ మీ బడ్స్ ఎయిర్ కి గట్టి పోటీ ఇవ్వవచ్చు.


#6. Mi 10 5జీ,Mi ట్రూ వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ తో పాటు ఇంకొక ప్రొడక్ట్ ను కూడా ఇండియాలో లాంచ్ చేయనున్న షామీ

షామీ మే 8 న Mi 10 5జీ, Mi ట్రూ వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ తో పాటు ఇంకొక ప్రోడక్ట్ ను కూడా ఇండియాలో లాంచ్ చేయనున్నది.షామీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ట్వీట్ చేసిన దాని ప్రకారం ఈ డివైస్ సాధారణ టీవీ ను స్మార్ట్ టీవీ గా మారుస్తుంది.కాబట్టి, ఈ ప్రొడక్ట్ Mi Box సిరీస్ కి సంభంధించింది లేదా Mi TV స్టిక్ అయి ఉండవచ్చు.కానీ, ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సివుంది. Manu Kumar Jain చేసిన ట్వీట్ ను మీరు ఈ క్రింద చూడవచ్చు.Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది