టెక్ న్యూస్ [ 09/05/2020 - 10/05/2020]


daily-tech-news-in-telugu


#1. Redmi Note 9 Pro Max స్మార్ట్ ఫోన్ సేల్ మే 12 న మొదటిసారిగా జరుగనున్నది.
Redmi Note 9 Pro Max మొదటిసారిగా మే 12 న మధ్యాహ్నం 12 గంటలకు సేల్ లో పాల్గొననున్నది. ఈ సేల్ అమెజాన్ ఇండియా మరియు mi.com ద్వారా జరుగనున్నది.

Redmi Note 9 Pro Max ధరను 6+64GB( రూ.16,499), 6+128GB( రూ.17,999), 8+128GB (రూ.19,999) కు సెట్ చేశారు.

Redmi Note 9 Pro Max స్మార్ట్ ఫోన్ 6.67 అంగుళాల FHD+ IPS తెర, స్నాప్ డ్రాగన్ 720G చిప్ సెట్, వెనుక భాగాన నాలుగు (64MP+8MP+5MP+2MP) కెమెరాలతో, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాతో, 5020mAh బ్యాటరీ తో వస్తుంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కి సపోర్ట్ చేస్తుంది.


#2. Realme X3 త్వరలో ఇండియాలోకి రానున్నది.!?

Realme ఇండియా CEO Madhav Sheth ట్విట్టర్ వేదికగా త్వరలో ఇండియా కి రానున్న Realme X3 యొక్క ఒక కెమెరా శాంపిల్ సు షేర్ చేశారు.తను షేర్ చేసిన ట్వీట్ ను మీరు ఈ క్రింద చూడవచ్చు.


దీనిని బట్టి ఈ Realme X3 స్మార్ట్ ఫోన్ 60x జూమ్ కెపాసిటీ కలది అని చెప్పుకోవచ్చు.దీనికి సంభంధించి కంపెనీ CEO ఎలాంటి స్పెసిఫికేషన్స్ ను పోస్ట్ చెయ్యలేదు. కానీ, ఆన్లైన్ లోని కొన్ని లీక్స్ ను బట్టి చూస్తే ఇది క్వాడ్ కెమెరా సెటప్ తో, రెండు సెల్ఫీ కెమెరా లతో, స్నాప్ డ్రాగన్ 855+ చిప్ సెట్ తో వస్తుంది అని తెలుస్తుంది. ఇవి కేవలం లీక్స్ మాత్రమే కనుక వీటిని ఎక్కువగా పరిగణలోకి తీసుకోవద్దు అని మా విన్నపం.


#3. Realme Narzo 10 మరియు Realme Narzo 10A స్మార్ట్ ఫోన్స్ మే 11 న ఇండియాలో లాంచ్ కానున్నాయి

ఎప్పటి నుంచో రియల్ మీ ఫాన్స్ ఎదురుచూస్తున్న Realme Narzo సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ఎట్టకేలకు మే 11 న (రేపు) మధ్యాహ్నం 12.30 కు ఆన్లైన్ ద్వారా లాంచ్ కానున్నాయి. మీరు ఈ లైవ్ స్ట్రీమ్ ను రియల్ మీ అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించవచ్చు.

ఈ Realme Narzo 10 మరియు Realme Narzo 10A రెండూ కూడా 5000mAh బ్యాటరీ తో, 6.5 అంగుళాల వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే తో వస్తున్నాయి. అయితే Realme Narzo 10A వెనుక మూడు కెమెరాలతో వస్తుండగా Realme Narzo 10 మాత్రం వెనుక భాగాన నాలుగు కెమెరా లతో వస్తుంది. ఇక Realme Narzo 10 లో MediaTek Helio G80 చిప్ సెట్ ను వాడారు.#4. ఫేస్ బుక్ డెస్క్ టాప్ వెర్షన్ లో డార్క్ మోడ్!ఎప్పుడూ వినియోగదారులకు క్రొత్త క్రొత్త ఫీచర్స్ ను అందించే ఫేస్ బుక్ ఈ సారి యూజర్స్ ఎదురుచూస్తున్న డార్క్ మోడ్ ను తన వెబ్ వెర్షన్ లో తెచ్చింది. చెప్పాలంటే ఫేస్ బుక్ లో ఈ డార్క్ మోడ్ ను కొన్ని నెలల క్రితం నుండి కొంత మంది ఎంపిక చేసిన యూజర్స్ కు మాత్రమే అందుబాటులో వుంది. కానీ, ఇప్పుడు ఎట్టకేలకు అందరికీ అందుబాటులోకి తెచ్చింది.

మీరు డెస్క్ టాప్ వెర్షన్ లో క్రొత్తగా వచ్చిన ఈ డార్క్ మోడ్ ను యాక్సిస్ చెయ్యాలి అని అనుకుంటే  ఈ క్రింది స్టెప్స్ ను ఫాలో అవ్వండి.
  • మొదటగా మీరు ఫేస్ బుక్ లోకి లాగిన్ అవ్వండి.
  • తరువాత మెనూ బార్ లో క్విక్ హెల్ప్ బటన్ ప్రక్కన వున్న డౌన్ యారో సింబల్ మీద క్లిక్ చెయ్యండి.
  • ఇప్పుడు Switch to New Facebook అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి.
  • ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే పాప్ అప్ మెసేజ్ లో ఉన్న Dark Mode అనే ఆప్షన్ ను ఎంచుకోండి.
ఒక వేళ మీకు డార్క్ మోడ్ నచ్చకపోతే మీరు మరలా ఈ ఫేస్ బుక్ క్రొత్త ఇంటర్ఫేస్ లో కుడి ప్రక్కన పైభాగాన నోటిఫికేషన్ సింబల్ వద్ద వున్న డౌన్ యారో మీద క్లిక్ చేసి  అక్కడ వుండే Dark mode అనే toggle ను ఆఫ్ చేసుకోవచ్చు.

ఒకవేళ మీకు ఈ క్రొత్త ఫేస్ బుక్ ఇంటర్ఫేస్ కూడా నచ్చలేదు అని అనుకుంటే నోటిఫికేషన్ సింబల్ ప్రక్కన వున్న డౌన్ యారో మీద క్లిక్ చేసి Switch to classic Facebook అనే దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది.


#5. జూమ్ అప్లికేషన్ ఏప్రిల్ 2020 డౌన్లోడ్స్ లో ఇండియా మొదటిస్థానంలో నిలిచిందిజూమ్ అప్లికేషన్ ను ఏప్రిల్ 2020 లో ఎక్కువగా డౌన్లోడ్ చేసుకున్న దేశాలలో ఇండియా మొదటిస్థానంలో నిలిచింది. ఈ అప్లికేషన్ ను ఏప్రిల్ 2020 లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 131 మిలియన్ల మంది ఇన్స్టాల్ చేసుకోగా దీనిలో దాదాపు 18.2 శాతం ఇన్స్టాల్స్ ఇండియా నుంచే జరిగాయి.ఇండియా తరువాత US 14.3 శాతంతో రెండవ స్థానంలో నిలిచింది.

అయితే భారత ప్రభుత్వం ఇంతకు ముందు జూమ్ అప్లికేషన్ ను ఉపయోగించటం అంత మంచింది కాదని తెలియచేసిన విషయం అందరికీ తెలిసిందే.కేవలం భారత ప్రభుత్వమే కాదు చాలా సెక్యూరిటీ సంస్థలు కూడా దీనిలోని లోపాలను బయటపెట్టాయి.

అయినా కూడా జూమ్ ను ఉపయోగించే వారి సంఖ్య అంతకంతకు పెరగటం గమనించదగిన విషయం.

అయితే టిక్ టాక్ అప్లికేషన్ ప్రపంచవ్యాప్తంగా ఇంతకు ముందు నెల 107 మిలియన్స్ డౌన్లోడ్స్ కు చేరుకోగా దీనిలో 22 శాతం డౌన్లోడ్స్ తో ఇండియా మొదటిస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది