టెక్ న్యూస్ [ 12/05/2020 - 13/05/2020]


daily-tech-news-in-telugu


#1. Honor View 10 స్మార్ట్ ఫోన్ కు ఇండియాలో సాఫ్ట్ వేర్ అప్డేట్ వచ్చింది


Honor View 10 కు ఇండియాలో సాఫ్ట్ వేర్ అప్డేట్ వచ్చింది అని సమాచారం. ఈ అప్డేట్ లో కంపెనీ వారు ఏప్రిల్ 2020 సెక్యూరిటీ ప్యాచ్ ను తీసుకువచ్చారు. అంతేకాకుండా యూజర్స్ ఈ అప్డేట్ లో Wi-Fi కాలింగ్ ఫీచర్ ను కూడా పొందవచ్చు.

 ఈ అప్డేట్ యొక్క సాఫ్ట్ వేర్ వెర్షన్ 10.0.0175 గా ఉండగా, దీని యొక్క సైజు 725MB గా వుంది.


#2. ఆరోగ్య సేతు అప్లికేషన్ లో రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్య 100 మిలియన్లు క్రాస్ చేసింది

భారతదేశ కరోనా కాంటాక్ట్ ట్రేసింగ్ అప్లికేషన్ అయిన ఆరోగ్య సేతు లో రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్య 100 మిలియన్ల దాటింది అని నీతి ఆయోగ్ సీఈఓ Amitabh Kant ట్వీట్ చేసారు. ఒకసారి మనం గమనించినట్లు అయితే ఈ అప్లికేషన్ ను ఇండియన్ గవర్నమెంట్ 2 ఏప్రిల్ 2020 న లాంచ్ చేసింది.

దీనిని బట్టి యాప్ ని లాంచ్ చేసిన 41 రోజుల్లోనే దీనిలో రిజిస్టర్ అయినవాళ్ళ సంఖ్య 100 మిలియన్లకు చేరుకుంది.

ఆరోగ్య సేతు యాప్ ఇది వరకే కేవలం 13 రోజుల్లోనే మొదటి 50 మిలియన్ల యూజర్స్ ను సంపాదించుకున్న విషయం తెలిసిందే.#3. Redmi Note 8, Redmi 8, Redmi 8A Dual స్మార్ట్ ఫోన్స్ ధర ఇండియాలో మరలా పెరిగింది

ఇండియాలో Redmi Note 8, Redmi 8, Redmi 8A Dual స్మార్ట్ ఫోన్స్ ధర మరలా పెరిగింది. Redmi Note 8 ధర రూ. 500 పెరగగా.. Redmi 8, Redmi 8A Dual ధర రూ. 300 చొప్పున పెరిగాయి. అయితే ఈ ఫోన్ లలో కొన్ని స్టోరేజ్ వేరియంట్ లలో మాత్రమే ఈ పెరుగుదలను గమించవచ్చు.

Redmi Note 8 స్మార్ట్ ఫోన్ 4GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 500 లు పెరిగి ప్రస్తుతం రూ.11,499 వద్ద లభిస్తుంది. దీని యొక్క 6GB RAM వేరియంట్ ధరలో ఏ మార్పూ లేదు.

Redmi 8 స్మార్ట్ ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 300 లు పెరిగి ప్రస్తుతం రూ. 9,299 వద్ద లభిస్తుంది.

Redmi 8 Dual స్మార్ట్ ఫోన్ 2GB RAM + 32GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 300 లు పెరిగి ప్రస్తుతం రూ. 7,299 వద్ద లభిస్తుంది. దీని 3GB RAM వేరియంట్ ధరలో ఏ మార్పూ లేదు.

ఈ ధరలు ఆల్రెడీ అమెజాన్ ఇండియా మరియు కంపెనీ వెబ్సైట్ లలో దర్శనమిస్తున్నాయి.


#4. తమ కంపెనీ ఫోన్స్ మీద కూడా నమ్మకం లేదంటున్న CEO లు!

షామీ CEO Lei Jun చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన Weibo లో ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఆశ్చర్యం ఏమిటంటే తాను ఈ పోస్ట్ ను షామీ ఫోన్ నుంచి కాకుండా iPhone నుండి పోస్ట్ చేశారు.

సాధారణంగా Weibo లో వినియోగదారుడు ఏ డివైస్ నుంచి పోస్ట్ చేసారో కనపడుతుంది. ఇదే నేపథ్యంలో ఈ క్రింది చూపిన విధంగా తాను పెట్టిన పోస్ట్ లో iPhone అని ఉండటం గమనార్హం. ఈ విషయం మీద చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ట్రోల్ చెయ్యటం మొదలుపెట్టారు. అయితే కొంత సేపటి తరువాత ఈ పోస్ట్ ను Lei Jun డెలీట్ చేయటం జరిగింది.

ఇలా జరగటం మొదటిసారి ఏమీ కాదు. ఇంతక ముందు రియల్ మీ ఇండియా CEO కూడా ఐఫోన్ నుంచి ట్విట్టర్ లో ట్వీట్ చెయ్యటం జరిగింది.

తమ కంపెనీ ఫోన్ల మీద వారికే నమ్మకం లేకుండా iPhone ను వాడుతూ తమ ఫోన్లే సెక్యూరిటీ, ప్రైవసీ మరియు ఫీచర్స్ లో గొప్పవి అని చెప్పుకోవటంలో ఏం అర్ధం వుందో వారికే తెలియాలి!#5. త్వరలో వన్ ప్లస్ 8 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ఇండియాలో లభించనున్నవి

వన్ ప్లస్ అభిమానులు ఇండియాలో వన్ ప్లస్ 8 సిరీస్ ఎప్పుడు లభ్యం అవుతుందా అని చాలా ఉత్సుకతతో వున్నారు. ఇప్పుడు దీనికి సంభంధించి ఆన్లైన్ లో కొంత సమాచారం లభ్యం అవుతుంది.

ఈ సమాచారం ప్రకారం నోయిడా లోని వన్ ప్లస్ ఫ్యాక్టరీ లో వన్ ప్లస్ 8 సిరీస్ ఫోన్స్ యొక్క ఉత్పత్తి మొదలయ్యింది అని, ఈ ఫోన్స్ మే నెలాఖరికి ఇండియాలో లభించనున్నాయి అని తెలుస్తుంది.

ఇండియాలో వన్ ప్లస్ 8 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

OnePlus 8:

6GB/128GB - Rs. 41,999
8GB/128GB - Rs. 44,999
12GB/256GB - Rs. 49,999

OnePlus 8 ప్రో:

8GB/128GB - Rs. 54,999
12GB/256GB - Rs. 59,999

అయితే ఈ సమాచారం గురించి కంపెనీ అధికారికంగా ఎటువంటి వ్యాఖ్య చెయ్యలేదు.


#6. Nokia 3.1 Plus కు ఇండియాలో ఆండ్రాయిడ్ 10 అప్డేట్ వచ్చింది

నోకియా 3.1 Plus కు ఇండియాలో సాఫ్ట్ వేర్ అప్డేట్ వచ్చింది. దీనిలో వినియోగదారులు ఆండ్రాయిడ్ 10 తో పాటు ఏప్రిల్ 2020 నెల సెక్యూరిటీ ప్యాచ్ ను కూడా పొందవచ్చు. దీనియొక్క సాఫ్ట్ వేర్ వెర్షన్ 3.15H గా ఉండగా సైజు 1.24GB గా వుంది.

మీరు ఒకవేళ ఈ మొబైల్ ను వాడుతున్నట్లు అయితే ఒకసారి సెట్టింగ్స్ కు వెళ్లి సాఫ్ట్ వేర్ అప్డేట్ ను చెక్ చేసుకోగలరు.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది