టెక్ న్యూస్ [ 14/05/2020 - 16/05/2020]


daily-tech-news-in-telugu


#1. ఈ ఎయిర్టెల్ ప్యాక్ మీద డబుల్ డేటా ను పొందండి.

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ ప్రజాదరణతో దూసుకుపోతున్న జియో తో పోటీ పడటానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఇదే నేపథ్యంలో ఎయిర్టెల్ రూ. 98 ప్యాక్ మీద లభించే డేటా ను డబుల్ చేసింది. ఇది వరకు ఈ ప్యాక్ తో రీఛార్జ్ చేసుకుంటే 6GB డేటా వచ్చేది. కానీ, ఇప్పుడు వినియోగదారులు 12 GB డేటా ను 28 రోజుల వాలిడిటీ తో పొందవచ్చు.

అదే విధంగా ఎయిర్టెల్ వివిధ రీఛార్జ్ ల మీద లభించే టాక్ టైం ను కూడా పెంచింది. ఇవి ఈ క్రింది విధంగా ఉన్నాయి.


ప్లాన్       టాక్ టైం (ఇప్పుడు ) టాక్ టైం (ఇది వరకు)
500480423.73
1000960847.46
500048004237


#2. రియల్ మీ TV మరియు వాచ్ మే 25 న ఇండియాలో లాంచ్ కానున్నాయి

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రియల్ మీ TV మరియు వాచ్ ఎట్టకేలకు ఈ నెల 25 న ఇండియాలో లాంచ్ అవ్వనున్నవి. ఈ విషయాన్ని రియల్ మీ ఇండియా CEO మాధవ్ సేథ్ కూడా స్పష్టం చేశారు. 

ఈ లాంచ్ ఈవెంట్ మే 25 న మధ్యాహ్నం 12.30 కు ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. అభిమానులు రియల్ మీ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ఈవెంట్ ను వీక్షించవచ్చు.

#3. Oppo K3 స్మార్ట్ ఫోన్ కు ఇండియాలో సాఫ్ట్ వేర్ అప్డేట్ వచ్చింది

Oppo K3 స్మార్ట్ ఫోన్ కు ఇండియాలో ఆండ్రాయిడ్ 10 ఆధారిత ColorOS 7 అప్డేట్ వచ్చింది అని సమాచారం. ఈ అప్డేట్ వెర్షన్ CPH1955_11_C.02 గా, సైజ్ 467MB గా ఉంది.

ఈ అప్డేట్ లో యూజర్లు వైఫై కాలింగ్ ఫీచర్ ను కూడా పొందవచ్చు.

ఒకవేళ మీరు ఈ ఫోన్ ను వాడుతున్నట్లు అయితే సెట్టింగ్స్ కు వెళ్లి అప్డేట్ ను చెక్ చేసుకోగలరు. అయితే ఈ అప్డేట్ దశలవారీగా రోల్ ఔట్ అవుతుంది. కాబట్టి ఒక వేళ మీకు ఈ అప్డేట్ రాకపోతే కంగారు పడనవసరంలేదు.


#4. మోటోరోలా ఎడ్జ్ ప్లస్ ఇండియాలో మే 19 న లాంచ్ కానున్నది

మోటోరోలా ఎడ్జ్ ప్లస్ ఇండియాలో మే 19 న లాంచ్ కానున్నది. ఈ విషయాన్ని ఫ్లిప్ కార్ట్ లోని టీజర్ పేజీ ను చూస్తే అర్ధం అవుతుంది. ఈ మొబైల్ ఇండియాలో త్వరలో లాంచ్ అవుతుంది అని మోటోరోలా ఇండియా CEO ఇది వరకే చెప్పటం గమనార్హం.

మోటోరోలా ఎడ్జ్ ప్లస్ 6.7 అంగుళాల FHD+ OLED తెరతో, ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం తో, 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 

ఇది స్నాప్ డ్రాగన్ 865 చిప్ సెట్ తో, LPDDR5 RAM తో వస్తుంది. 

దీనిలో వెనుక భాగాన 108 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 16 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ టెలీఫోటో లెన్స్ అనే మూడు కెమెరా లను ఉపయోగించారు. దీని ముందు భాగాన 25 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను గమనించవచ్చు. 

ఇక దీనిలో 5000mAh బ్యాటరీ ను ఉపయోగించారు. ఇది 18W వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్ లెస్ ఛార్జింగ్, 5W రివెర్స్ ఛార్జింగ్ కు సపోర్ట్ ను యిస్తుంది. 


#5. ప్రపంచవ్యాప్తంగా 2020 మొదటి త్రైమాసికంలో ఎక్కువగా అమ్ముడు పోయిన స్మార్ట్ ఫోన్ 

ప్రపంచవ్యాప్తంగా 2020 మొదటి త్రైమాసికంలో ఎక్కువగా అమ్ముడు పోయిన స్మార్ట్ ఫోన్ గా Samsung Galaxy A51 నిలిచింది. ఈ సమాచారాన్ని ప్రముఖ రీసెర్చ్ సంస్థ Strategy Analytics వెల్లడించింది.

Redmi 8 మరియు Samsung Galaxy S20+ రెండవ మరియు మూడవ స్థానాల్లో నిలిచాయి. 

Samsung Galaxy A51 స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల సూపర్ AMOLED తెరతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత OneUI 2.0 మీద నడుస్తుంది. దీనిలో Exynos 9611 చిప్ సెట్ ను వాడారు. 

ఇండియాలో ఇది 6GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ లో లభిస్తుంది. దీని ధర రూ. 25,250 గా వుంది. ఇది Prism Crush Black, Prism Crush Blue మరియు Prism Crush White అనే మూడు కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. 


#6. గూగుల్ క్రోమ్ త్వరలో CPU,బ్యాటరీ మీద ఎక్కువ ప్రభావం చూపనున్న యాడ్స్ ను బ్లాక్ చెయ్యనున్నది

ప్రపంచవ్యాప్తంగా అధికంగా ఉపయోగించే బ్రౌజర్లలో గూగుల్ క్రోమ్ ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంటుంది. దీనికి కారణం దీనిలోని వివిధ ఫీచర్స్ మరియు సెక్యురిటి పరంగా తీసుకునే జాగ్రత్తలు.

అయితే తాజాగా గూగుల్, క్రోమ్ యాడ్స్ విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం గూగుల్ త్వరలో గూగుల్ క్రోమ్ లో అధికంగా CPU ను,బ్యాటరీ ను ఉపయోగించుకునే యాడ్స్ ను బ్లాక్ చెయ్యనున్నది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ స్టేజ్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

ఒక వేళ కంపెనీ గూగుల్ క్రోమ్ లో యాడ్స్ కు సంభంధించి ఈ పరిమితులను తెస్తే కొంత లిమిట్ కంటే  ఎక్కువగా రిసోర్సెస్ ను ఉపయోగించుకునే యాడ్స్ స్థానంలో ఎర్రర్ మెసేజ్ వస్తుంది. 


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది