కరోనా నేపథ్యంలో దేశంలో విధించబడిన లాక్ డౌన్ లో చాలా మంది ప్రజలు తమ ఇళ్లల్లోనే ఉంటూ వివిధ క్రొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటే కొంతమంది మిత జ్ఞానంతో తప్పుడు సమాచారాన్ని వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ల ద్వారా షేర్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో సమాచారం ఎంత వేగంగా విస్తరిస్తుందో మనకి తెలిసిందే.షేర్ చేసిన సమాచారం నిజమయినది అయితే ఎటువంటి సమస్యా ఉండదు.కానీ, ఈ సమాచారం ఫేక్ అయితే దాని వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడవలసి వస్తుంది.

ప్రస్తుతం వున్న సోషల్ మీడియా మరియు వీడియో షేరింగ్ ప్లాట్ ఫారం లలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న వాటిలో టిక్ టాక్ ఒకటి.దీనిని దృష్టిలో పెట్టుకుని తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట వెయ్యటానికే టిక్ టాక్ ఒక క్రొత్త ఉపయోగకరమయిన ఫీచర్ ను తీసుకువచ్చింది.

ఈ ఫీచర్ ద్వారా టిక్ టాక్ అప్లికేషన్ లో కరోనా గురించి ఎమన్నా తప్పుదోవ పట్టించే వీడియో మీ కంటపడినా లేదా మీకు ఆ వీడియో లోని కంటెంట్ తప్పు అని భావించినా మీరు ఆ వీడియో ను ఇన్ యాప్ రిపోర్టింగ్ ద్వారా క్రొత్తగా ఏర్పాటు చేసిన Misleading information సెక్షన్ లో వున్న COVID-19 misinformation గుండా రిపోర్ట్ చెయ్యొచ్చు.

ఈ ఫీచర్ ను ఎలా ఉపయోగించాలి?

టిక్ టాక్ యూజర్స్ కనుక కరోనా గురించి మిస్ లీడింగ్ ఇన్ఫర్మేషన్ కలిగిన వీడియోను గమనించిన యెడల షేర్ బటన్ పై క్లిక్ చేసి Report మీద క్లిక్ చేసి Misleading information>COVID-19 misinformation కు వెళ్లి ఆ వీడియో ను రిపోర్ట్ చెయ్యవచ్చు.అలానే మీరు ఆ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కూడా రాయవచ్చు.

tiktok-covid-19-misinformation-section

మీరు సబ్ మిట్ చేసిన వీడియోను టిక్ టాక్ కి చెందిన ఇంటర్నల్ టాస్క్ ఫోర్స్ చెక్ చేసి వివిధ థర్డ్ పార్టీ ఫాక్ట్  చెకర్స్ కు షేర్ చేస్తారు మరియు వారు ఆ వీడియోను పరిశీలించటం జరుగుతుంది.ఇప్పటికే విశ్వాస్ న్యూస్ యొక్క ఫాక్ట్ చెక్ టీం తో టిక్ టాక్ భాగస్వామ్యం అయ్యింది అని తెలుస్తుంది.

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తప్పుదోవ పట్టించే సమాచారం కూడా అంతే వేగంతో విస్తరిస్తున్నది.కనుక టిక్ టాక్ మాత్రమే కాకుండా వివిధ సోషల్ మీడియా సంస్థలు కూడా మిస్ లీడింగ్ ఇన్ఫర్మేషన్ ను అడ్డుకోవడానికి వివిధ చర్యలు తీసుకుంటున్నాయి.

టిక్ టాక్ ఈ ఫీచర్ ను దశలవారీగా విడుదలచేస్తుంది.కాబట్టి మీకు ఈ ఫీచర్ రాకపోతే త్వరలోనే వస్తుంది.అలానే మీ టిక్ టాక్ అప్లికేషన్ కూడా అప్డేట్ గా ఉంచుకోవడం మర్చిపోవద్దు.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది