Vivo V19 Launched in India: Price, Specifications, Features and more | in Telugu


Vivo V19 Launched in India: Price, Specifications, Features and more | in Telugu

Vivo V19 స్మార్ట్ ఫోన్ మే 12 2020 న ఇండియాలో లాంచ్ అయ్యింది. చెప్పాలంటే ఈ ఫోన్ ఇండియాలో ఇంతకముందే లాంచ్ కావలసి వుంది. కానీ లాక్ డౌన్ కారణంగా ఇది లాంచ్ కాలేదు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గ్రీన్ మరియు ఆరంజ్ జోన్ లలో ఆంక్షలు సడలించిన తరుణంలో అన్ని కంపెనీలు తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో వివో కూడా  ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇండియాలో దీని ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ను మీరు ఈ క్రింద చదవవచ్చు.


Vivo V19 ధర(ఇండియా)


ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్ లలో వస్తుంది. దీని ధరను ఇండియాలో 8GB RAM+128 ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ను రూ. 27,990 గా సెట్ చేస్తారు. అలానే 8GB RAM +256 ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 31,990 గా సెట్ చేసారు. ఈ ఫోన్ పియానో బ్లాక్ మరియు మిస్టిక్ సిల్వర్ అనే రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఈ ఫోన్ యొక్క సేల్ వివో యొక్క ఈ-స్టోర్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఇండియా మరియు వివిధ ఆన్లైన్ మరియు ప్రముఖ ఆఫ్ లైన్ స్టోర్ లలో మే 15 నుండి జరుగనున్నది.


Vivo V19 స్పెసిఫికేషన్స్ 


Vivo V19 6.44 అంగుళాల FHD+ E3 OLED హోల్ పంచ్ తెరతో, ఆరవ తరం గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది.

ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత FunTouch OS 10 మీద నడుస్తుంది. దీనిలో స్నాప్ డ్రాగన్ 712 ప్రాసెసర్ ను ఉపయోగించారు.

కెమెరా పరంగా దీనిలో వెనుక భాగాన 48 మెగా పిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సల్ మాక్రో మరియు 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ అనే నాలుగు కెమెరాలను అమర్చారు.

ఈ ఫోన్ ముందు భాగాన 32 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా మరియు 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అనే రెండు కెమెరా లను గమనించవచ్చు.

ముందుగా చెప్పుకున్నట్లు ఇది 8జీబీ RAM తో, 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

కనెక్టివిటీ పరంగా దీనిలో బ్లూ టూత్ 5.0, ఓటేజీ, USB Type-C పోర్ట్, GPS, 2.4GHz  మరియు 5GHz డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మొదలయినవి వున్నాయి.

దీనిలో ఫింగర్ ప్రింట్(ఇన్ డిస్ప్లే), యాక్సిలెరోమీటర్, లైట్, ప్రాక్సిమిటీ, ఈ-కంపాస్, గైరో స్కోప్ అనే వివిధ సెన్సార్లు వున్నాయి.

ఇక ఇది 4500mAh బ్యాటరీ తో, 33W FlashCharge 2.0 టెక్నాలజీ తో వస్తుంది.

Read Also: జనరల్ నాలెడ్జి- 45


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది