Samsung Galaxy Tab S6 Lite Launched in India: Price, Specifications and more in Telugu


Samsung Galaxy Tab S6 Lite Launched in India: Price, Specifications and more


Samsung Galaxy Tab S6 Lite జూన్ 8 న ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ ట్యాబ్ 10.4 అంగుళాల తెరతో, S-పెన్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ట్యాబ్ Wi-Fi మరియు LTE అనే రెండు వేరియంట్ లలో మరియు Angora Blue, Chiffon Pink, మరియు Oxford Gray అనే మూడు కలర్స్ ఆప్షన్స్ లో లభిస్తుంది. దీని యొక్క పూర్తి వివరాలను మీరు ఈ క్రింద చదవవచ్చు. 

Samsung Galaxy Tab S6 Lite ధర(ఇండియా)

Samsung Galaxy Tab S6 Lite యొక్క Wi-Fi వేరియంట్ ఇండియాలో రూ. 27,999 కు మరియు LTE వేరియంట్ రూ. 31,999 కు లభిస్తుంది. ఈ రెండు వేరియంట్స్ కూడా Angora Blue, Chiffon Pink, మరియు Oxford Gray అనే మూడు కలర్ ఆప్షన్స్ లో వస్తున్నాయి. ఈ టాబ్లెట్ జూన్ 16 వరకు ప్రీ బుకింగ్ ద్వారా లభిస్తుంది. అలానే జూన్ 17 నుండి ఇది సేల్ లో పాల్గొననున్నది. 

ఈ టాబ్లెట్ యొక్క Wi-Fi వేరియంట్ కేవలం అమెజాన్, Samsung ఇండియా ఈ-స్టోర్ ద్వారా లభిస్తుంది. అలానే LTE వెర్షన్ ప్రముఖ ఆఫ్ లైన్, ఆన్లైన్ స్టోర్ లలో మరియు Samsung ఇండియా ఈ-స్టోర్ ద్వారా లభిస్తుంది.

Samsung Galaxy Tab S6 Lite స్పెసిఫికేషన్స్

Samsung Galaxy Tab S6 Lite టాబ్లెట్ 10.4 అంగుళాల WUXGA (1,200x2,000 పిక్సల్స్) TFT తెరతో, ఆండ్రాయిడ్ 10 ఆధారిత OneUI 2.0 మీద నడుస్తుంది. 

దీనిలో octa-core చిప్ సెట్ ను ఉపయోగించారు. ఇది 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. మీరు ఇంటర్నల్ స్టోరేజ్ ను microSD కార్డు ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు.

ఈ ట్యాబ్ వెనుక భాగాన 8 మెగాపిక్సల్ కెమెరా ను, ముందు భాగాన 5 మెగాపిక్సల్ కెమెరా ను గమనించవచ్చు.

కనెక్టివిటీ పరంగా దీనిలో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూ టూత్ 5.0, GPS/ A-GPS, మైక్రో USB 2.0 మరియు 3.5mm ఆడియో జాక్ మొదలయినవి వున్నాయి. ఈ ట్యాబు యొక్క LTE వేరియంట్ లో వీటితో పాటు 4G LTE సపోర్ట్ కూడా వుంది. 

దీనిలో యాక్సిలెరోమీటర్, లైట్, హాల్ మరియు గైరో స్కోప్ వంటి మొదలయిన సెన్సార్లు వున్నాయి. 

అలానే ఇది డ్యూయల్ స్పీకర్స్ తో వస్తుంది. ఈ స్పీకర్స్ Dolby Atmos 3D సరౌండ్ సౌండ్ సపోర్ట్ కలిగి ఉన్నవి.

ఇక ఇది 7040mAh బ్యాటరీ తో వస్తుంది. ముందుగా చెప్పుకున్నట్లుగానే ఇది S-పెన్ సపోర్ట్ తో వస్తుంది. ఈ S-పెన్ 0.7mm టిప్ ను,  7.03 గ్రాముల బరువు ను కలిగి వుంది. 


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది