టెక్ న్యూస్ [ 02/06/2020 - 03/06/2020]


daily-tech-news-in-telugu


#1. Oppo Find X2 సిరీస్ ఇండియాలో జూన్ 17 న లాంచ్ కానున్నది

Oppo Find X2 సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఇండియాలో జూన్ 17 న లాంచ్ కానున్నవి. ఈ సిరీస్ లో మొత్తం నాలుగు ఫోన్స్ వున్నాయి. అయితే కంపెనీ ఇండియాలో ఈ నాలుగు ఫోన్స్ ను తీసుకువస్తుందా లేదా కొన్నింటిని మాత్రమే తీసుకువస్తుందా అనేది ఇంకా తెలియరాలేదు.

ఈ లాంచ్ ఈవెంట్ జూన్ 17 న సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్ ద్వారా జరుగనున్నది. త్వరలోనే కంపెనీ ఈ స్ట్రీమింగ్ కు సంభంధించిన లింక్ ను వెల్లడి చెయ్యగలదు.


#2. Mitron అప్లికేషన్ ప్లే స్టోర్ నుంచి తొలగించబడింది

ఈ మధ్య కొన్ని కారణాల వల్ల చాలా మంది టిక్ టాక్ అప్లికేషన్ ను తమ ఫోన్ నుంచి తొలగించి Mitron అనే అప్లికేషన్ ను ఇన్స్టాల్ చేసుకుని వినియోగిస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఈ Mitron అప్లికేషన్ ను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ అప్లికేషన్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించటానికి కారణం ప్లే స్టోర్ యొక్క spam and minimum functionality (స్పామ్ మరియు కనీస ఫంక్షనాలిటీ) పాలసీ ను అతిక్రమణ అని తెలుస్తుంది.

సెక్యూరిటీ మరియు ప్రైవసీ విషయంలో కూడా ఈ అప్లికేషన్ లో చాలా సమస్యలు ఉన్నట్లు కొందరు సెక్యూరిటీ రీసెర్చర్ లు అభిప్రాయపడిన విషయం కూడా మనకు విధితమే.

చూడాలి.. ఈ అప్లికేషన్ మరలా ప్లే స్టోర్ లోకి వస్తుందా రాదా అని!


#3. Remove China Apps యాప్ ప్లే స్టోర్ నుంచి తొలగించబడింది   

పైన టెక్ న్యూస్ లో చెప్పుకున్నట్లు గానే కొన్ని రోజుల నుండి నడుస్తున్న పరిణామాల వల్ల చైనా అప్లికేషన్స్ ను వాడకూడదు అనే ధోరణి లో ఇండియన్స్ వున్నారు. ఇదే నేపథ్యంలో మన ఫోన్ లో వున్న చైనా కి సంభంధించిన అప్లికేషన్స్ ను తెలుసుకుని తొలగించుకునే ఆండ్రాయిడ్ అప్లికేషన్ Remove China Apps విపరీత ఆదరణను సంపాదించుకుంది.

అయితే ఈ అప్లికేషన్ ను ప్రస్తుతం ప్లే స్టోర్ నుండి గూగుల్ తొలగించింది. దీనికి కారణం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ యొక్క పాలసీను అతిక్రమించినట్లు గా తెలుస్తుంది.

ఈ అప్లికేషన్ ఈ సంవత్సరం మే 17 న లాంచ్ అయ్యింది. ఈ అప్లికేషన్ ను ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకున్న వినియోగదారులు 50 లక్షలు క్రాస్ అయ్యారు మరియు దీని రేటింగ్ 4.9 గా ఉండేది. అలానే ఇది ప్లే స్టోర్ లో టాప్ ఫ్రీ యాప్స్ లో ఒకటిగా ఉండేది.

కానీ, ఇది థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ను Uninstall చేసే విధంగా వినియోగదారులను ప్రోత్సహించేదిగా ఉంది అని, అందువల్లే ఈ యాప్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు తెలుస్తుంది.


#4. త్వరలో Jio ఫోన్ వాట్సాప్ అప్లికేషన్ లో మీరు స్టేటస్ అప్డేట్స్ పెట్టుకోవచ్చు

త్వరలో Jio ఫోన్ వినియోగదారులు తమ వాట్సాప్ అప్లికేషన్ లో స్టేటస్ అప్డేట్స్ ను పంచుకోవచ్చు అని తెలుస్తుంది. ఈ ఫీచర్ త్వరలోనే Jio ఫోన్ వినియోగదారులు పొందుతారు. మనకు తెలిసినట్లు గానే Jio ఫోన్ కు సంభందించిన వాట్సాప్ అప్లికేషన్ లో ఆండ్రాయిడ్ మరియు iOS లతో పోల్చుకుంటే లిమిటెడ్ ఫీచర్స్ మాత్రమే వున్నాయి.

ప్రస్తుతానికి ఈ అప్డేట్ కి సంభంధించి ఎలాంటి టైమ్ లైన్ తెలియరాలేదు. దీనికి సంభంధించిన మరింత సమాచారం కోసం మేము ప్రయత్నిస్తున్నాము.

గతంలోకి చూస్తే Jio ఫోన్ వినియోగదారులు లిమిటెడ్ ఫీచర్స్ తో వాట్సాప్ అప్లికేషన్ ను సెప్టెంబర్ 2018 న పొందటం జరిగింది.


#5. Samsung తన ప్రొడక్ట్స్ మీద వారెంటీను పొడిగించింది

Samsung తన ప్రొడక్ట్స్ మీద వారెంటీను పొడిగించింది. కరోనా నేపథ్యంలో విధించబడిన లాక్ డౌన్ నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

ఇక వివరాలలోకి వెళ్తే, 20 మార్చ్ 2020 మరియు 31 మే 2020 మధ్య వారెంటీ ముగిసిన అన్ని Samsung ప్రొడక్ట్స్ మీద వారెంటీను కంపెనీ జూన్ 15 కు పెంచింది.

ఈ నిర్ణయం Samsung యొక్క వివిధ క్యాటగిరీలకు సంభంధించిన ప్రొడక్ట్స్ కు వర్తిస్తుంది.Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది