Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. సునామి అనే పదం ఏ భాష లోనిది?

జ. జపనీస్ 


ప్రశ్న. సౌర కుటుంబంలో అతి పెద్ద ఉపగ్రహం.

జ. Ganymede


ప్రశ్న. Ganymede దేని యొక్క ఉపగ్రహం?

జ. బృహస్పతి (గురు గ్రహము)


ప్రశ్న. భారత దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వు ఏది?

జ. నాగార్జున సాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యం



కరెంట్ అఫైర్స్  


ప్రశ్న. భారత దేశంలో COVID-19 భారిన పడ్డ మొదటి ముఖ్య మంత్రి ఎవరు?

జ. శివరాజ్ సింహ్ చౌహాన్ (మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి)


ప్రశ్న. రాజస్థాన్ రాష్ట్ర మొట్ట మొదటి ప్లాస్మా బ్యాంక్ ను ఎక్కడ ఏర్పాటు చేసారు?

జ. రాజస్థాన్ రాజధాని అయిన జైపూర్ లో 

నోట్స్: ఇండియాలో మొట్ట మొదటి ప్లాస్మా బ్యాంక్ ఢిల్లీ లో ఏర్పాటు చేయబడినది.


ప్రశ్న.  నేపాల్ తో సరిహద్దును పంచుకుంటున్న భారతదేశ రాష్ట్రాలు ఏవి?

జ. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, సిక్కిం, బీహార్ మరియు పశ్చిమ బెంగాల్



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. జావా లోని ఏ ప్యాకేజీ లో నెట్వర్కింగ్ కు సంబంధించిన ఇంటర్ఫేస్ లు మరియు క్లాసెస్ లు ఉంటాయి?

జ. java.net 


ప్రశ్న. మొట్టమొదటి ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది?

జ. SmallTalk 


ప్రశ్న. కంపైల్ అయిన జావా కోడ్ ఫైల్స్ ఏ ఎక్స్టెన్షన్ ను కలిగి ఉంటాయి?

జ. .class 


జనరల్ నాలెడ్జి- 55 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. లక్షద్వీప్ రాజధాని ఏది?

జ. Kavaratti (కవరత్తి)


Over to you 

ఎడారులు లేని ఖండం ఏది?

సమాధానం తెలిసిన యెడల ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యగలరు.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి- 55


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది