Motorola One Fusion+ సేల్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ ద్వారా జరుగనున్నది. ధర మరియు పూర్తి వివరాలు ఇవి..




Motorola One Fusion+ స్మార్ట్ ఫోన్ సేల్ ఈరోజు ఇండియాలో ఫ్లిప్ కార్ట్ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు జరుగనున్నది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ సంవత్సరం జూన్ నెలలో ఇండియాలో లాంచ్ అయ్యింది. లాంచ్ అయిన తరువాత ఈ స్మార్ట్ ఫోన్ కు ఇది రెండవ సేల్. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగాన క్వాడ్ కెమెరా సెటప్ తో, పాప్ అప్ సెల్ఫీ కెమెరా తో, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తో వస్తుంది. దీని ధర మరియు పూర్తి వివరాలను మీరు ఈ క్రింద చదవవచ్చు.

Motorola One Fusion+ స్మార్ట్ ఫోన్ ఇండియాలో 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ లో లభిస్తుంది. దీని ధరను కంపెనీ వారు రూ. 16,999 కు సెట్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ Moonlight White మరియు Twilight Blue అనే రెండు కలర్ వేరియంట్ లలో లభిస్తుంది. ముందుగా చెప్పుకున్నట్లు ఈ ఫోన్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ లో పాల్గొననున్నది.


స్పెసిఫికేషన్స్ ను పరిశీలించినట్లు అయితే, ఈ ఫోన్ 6.5 అంగుళాల FHD+ (1080x2340 పిక్సల్స్) IPS TFT LCD తెరతో, 19.5:9 aspect రేషియో తో, 395ppi పిక్సెల్ డెన్సిటీ తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం మీద నడుస్తుంది.

ఈ ఫోన్ లో octa-core స్నాప్ డ్రాగన్ 730G SoC మరియు Adreno 618 GPU ను ఉపయోగించారు. ఈ స్మార్ట్ ఫోన్ 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. మీరు దీనిలో స్టోరేజ్ ను 1TB వరకు microSD కార్డు ద్వారా పెంచుకోవచ్చు.

కెమెరా పరంగా దీనిలో వెనుక భాగాన 64-మెగాపిక్సల్ ప్రైమరీ , 8-మెగాపిక్సల్ వైడ్ యాంగిల్, 5-మెగాపిక్సల్ మాక్రో, 2-మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్ అనే నాలుగు కెమెరాలు వున్నాయి. సెల్ఫీ ల కోసం ఈ ఫోన్ ముందుభాగాన 16-మెగాపిక్సల్ పాప్ అప్ కెమెరా ను అమర్చారు.

కనెక్టివిటీ పరంగా దీనిలో బ్లూ టూత్ v5.0, GPS, 4G VoLTE, 3.5mm హెడ్ ఫోన్ జాక్, Wi-Fi మరియు USB టైప్-C మొదలయినవి వున్నాయి. 

దీనిలో ప్రాక్సిమిటీ, యాక్సిలెరోమీటర్, లైట్, గైరో స్కోప్ వంటి సెన్సార్లతో పాటు వెనుక భాగాన ఫింగర్ ప్రింట్ సెన్సార్ వుంది. అలానే ఫోన్ కు ప్రక్కన వాల్యూం బటన్స్ క్రింది భాగాన గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా ఇవ్వటం జరిగింది.

ఇక ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ తో వస్తుంది మరియు ఇది 18W TurboPower ఛార్జింగ్ టెక్నాలజీ కు సపోర్ట్ చేస్తుంది.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది