POCO M2 Pro Launched in India: Price, Specifications, and Features | in Telugu





POCO M2 Pro స్మార్ట్ ఫోన్ ఇండియాలో 07 జులై 2020 న లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్, హోల్-పంచ్ తెరతో, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 16-మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా తో వస్తుంది. ఇది ఫ్లిప్ కార్ట్ ద్వారా లభించనున్నది.

POCO M2 Pro స్మార్ట్ ఫోన్ మొత్తం మూడు స్టోరేజ్ వేరియంట్ లలో వస్తుంది. దీని 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ. 13,999 వద్ద, 6GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ. 14,999 వద్ద, ఇక 6GB RAM +128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 16,999 వద్ద లభిస్తుంది. 

ఈ ఫోన్ గ్రీన్ అండ్ గ్రీనర్, అవుట్ అఫ్ ది బ్లూ, టూ షేడ్స్ అఫ్ బ్లాక్ అనే మూడు కలర్ వేరియంట్స్ లలో వస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొట్టమొదటి సేల్ జులై 14 న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ ద్వారా జరుగనున్నది.


POCO M2 Pro స్పెసిఫికేషన్స్:

ఈ స్మార్ట్ ఫోన్ 6.67 అంగుళాల FHD+ (1,080x2,400 పిక్సల్స్) LCD తెర, 20:9 aspect రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, P2i నానో కోటింగ్ కలిగిన స్ప్లాష్ ప్రూఫ్ డిజైన్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత MIUI 11 మీద నడుస్తుంది.

దీనిలో స్నాప్ డ్రాగన్ 720G చిప్ సెట్ మరియు Adreno 618 GPU ను ఉపయోగించారు.

ముందుగా చెప్పుకున్నట్లు ఇది గరిష్టంగా 6GB RAM మరియు 128GB స్టోరేజ్ తో వస్తుంది. మీరు స్టోరేజ్ ను 512GB వరకు microSD కార్డు ద్వారా పెంచుకోవచ్చు.

కెమెరా పరంగా దీనిలో వెనుక భాగాన నాలుగు కెమెరాలు ( 48MP ప్రైమరీ + 8MP వైడ్ యాంగిల్ + 2MP డెప్త్ సెన్సార్ +5MP మాక్రో సెన్సార్ ) వున్నాయి. దీని ముందు భాగాన 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు.

కనెక్టివిటీ పరంగా దీనిలో 4G VoLTE, Wi-Fi, బ్లూ టూత్ v5.0, GPS/A-GPS, USB టైప్-C మరియు 3.5mm హెడ్ ఫోన్ జాక్ మొదలయినవి వున్నాయి.

దీనిలో ఆక్సిలేరోమేటర్, లైట్, ప్రోక్సీమిటీ, ఈ-కంపాస్, హాల్,  గైరో స్కోప్ సెన్సార్ లతో పాటు సెక్యూరిటీ కొరకు ఈ ఫోన్ యొక్క పవర్ బటన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అమర్చబడి ఉంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ 5000mAh బ్యాటరీ ను కలిగి, 33W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా కంపెనీ వారే ఫోన్ తో పాటు 33W ఫాస్ట్ చార్జర్ ను ప్రొవైడ్ చేశారు.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది