Redmi Note 9 with MediaTek Helio G85 SoC, 5020mAh Battery Launched in India: Price, Specifications | in Telugu


Redmi Note 9 with MediaTek Helio G85 SoC, 5000mAh Battery Launched in India: Price, Specifications | in Telugu



Redmi Note 9 స్మార్ట్ ఫోన్ 20 జులై 2020 న ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ హోల్ పంచ్ తెరతో, 5,020mAh బ్యాటరీ, 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. దీని యొక్క ధర మరియు పూర్తి వివరాలను మీరు ఈ క్రింద చదవవచ్చు. 


Redmi Note 9 ధర(ఇండియా):

Redmi Note 9 స్మార్ట్ ఫోన్ ఇండియాలో మొత్తం మూడు స్టోరేజ్ వేరియంట్ లలో లభిస్తుంది. కంపెనీ వారు దీని 4GB RAM+64GB స్టోరేజ్ ధరను రూ. 11,999 కు, 4GB RAM+128GB స్టోరేజ్ ధరను రూ. 13,499 కు, 6GB RAM+128GB స్టోరేజ్ ధరను రూ. 14,999 కు సెట్ చేశారు.

ఈ ఫోన్ Aqua Green, Arctic White, మరియు Pebble Grey అనే కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. ఈ ఫోన్ జులై 24 నుండి ఫ్లిప్ కార్ట్, mi.com మరియు mi హోమ్ స్టోర్స్ లలో లభిస్తుంది.


Redmi Note 9 స్పెసిఫికేషన్స్:

స్పెసిఫికేషన్స్ పరంగా చూస్తే, Redmi Note 9 స్మార్ట్ ఫోన్ 6.53-అంగుళాల FHD+ (1,080x2,340 పిక్సల్స్ ) తెరతో, 19.5:9 aspect రేషియో తో, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది.

దీనిలో మీడియా టెక్ హీలియో G85 ప్రాసెసర్ ను, Arm Mali-G52 GPU ఉపయోగించారు.

ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత MIUI 11 మీద నడుస్తుంది.

ముందుగా చెప్పుకున్నట్లు ఇది గరిష్టంగా 6GB RAM తో, 128GB స్టోరేజ్ తో వస్తుంది. దీనిలోని స్టోరేజ్ ను మీరు 512GB వరకు microSD కార్డు ద్వారా పెంచుకోవచ్చు.

Redmi Note 9 Rear Camera Array


కెమెరా పరంగా దీనిలో వెనుక భాగాన 48MP ప్రైమరీ, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మాక్రో సెన్సార్ అనే నాలుగు కెమెరాలు వున్నాయి. సెల్ఫీల కోసం దీనిలో ముందు భాగాన 13MP కెమెరాను అమర్చారు.

కనెక్టివిటీ పరంగా దీనిలో 4G VoLTE, Wi-Fi 802.11 a/b/g/n, బ్లూ టూత్ v5.0, GPS/ A-GPS, USB టైప్ -C పోర్ట్ మరియు 3.5mm హెడ్ ఫోన్ జాక్ మొదలయినవి వున్నాయి. 

దీనిలో యాక్సిలెరోమీటర్, గైరో స్కోప్, లైట్, ప్రాక్సిమిటీ, ఈ-కంపాస్ మరియు ఫింగర్ ప్రింట్ (వెనుక భాగాన) మొదలయిన సెన్సార్లు వున్నాయి.


Redmi Note 9 Battery

ఇక Redmi Note 9 స్మార్ట్ ఫోన్ 5,020mAh బ్యాటరీ తో వస్తుంది. ఇది 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ కు, 9W రివర్స్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. కంపెనీ వారు ఈ ఫోన్ కొనుగోలుదారులకు 22.5W ఛార్జర్ ను ఫోన్ తో పాటే అందిస్తారు.



Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది