Redmi Note 9 Pro New Storage Variant Goes on Sale for the First time Today in India: Price and Specifications






Redmi Note 9 Pro స్మార్ట్ ఫోన్ యొక్క ఫ్లాష్ సేల్ ఈరోజు మరొక సారి జరుగనున్నది. ఒకసారి గతంలోకి చూస్తే Redmi Note 9 Pro స్మార్ ఫోన్ ఇండియాలో కేవలం రెండు స్టోరేజ్ వేరియంట్ లలో, మూడు కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. 

అయితే కంపెనీ వారు ఈ ఫోన్ యొక్క సరిక్రొత్త స్టోరేజ్ వేరియంట్ (4GB+128GB) ను ఇండియాలో సోమవారం నాడు ఇంట్రడ్యూస్ చేసారు. దీని ధరను కంపెనీ వారు రూ. 15,999 గా సెట్ చేసారు.

ఈరోజు జరిగే Redmi Note 9 Pro సేల్ లో ఈ క్రొత్త స్టోరేజ్ వేరియంట్ కూడా పాల్గొననున్నది. ఈ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు mi.com, అమెజాన్ ఇండియా ద్వారా జరుగనున్నది. 

ఈ ఫోన్ యొక్క 4GB RAM + 64GB స్టోరేజ్ రూ. 13,999 వద్ద, 6GB RAM +128GB స్టోరేజ్ రూ. 16,999 వద్ద లభిస్తుంది.


Redmi Note 9 Pro స్పెసిఫికేషన్స్:

ఈ ఫోన్ 6.67-అంగుళాల FHD+ (1,080x2,400 పిక్సల్స్) IPS తెరతో, 20:9 aspect రేషియో తో వస్తుంది. దీనిలో octa-core స్నాప్ డ్రాగన్ 720G SoC, Adreno 618 GPU ను ఉపయోగించారు. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత MIUI 11 మీద నడుస్తుంది.

కెమెరా పరంగా దీని వెనుక భాగాన 48-మెగాపిక్సల్ ప్రైమరీ, 8-మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5-మెగాపిక్సల్ మాక్రో లెన్స్, 2-మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్ అనే నాలుగు కెమెరాలు వున్నాయి. దీని ముందు భాగాన 16-మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ను గమనించవచ్చు.

కనెక్టివిటీ పరంగా దీనిలో 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS/ A-GPS, NavIC, USB టైప్ -C పోర్ట్, 3.5mm హెడ్ ఫోన్ జాక్ మొదలయినవి వున్నాయి. 


దీనిలో లైట్, ప్రాక్సిమిటీ, ఈ-కంపాస్, యాక్సిలెరోమీటర్, గైరో స్కోప్ వంటి మొదలయిన సెన్సార్లు తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా గమనించవచ్చు.

ఇక ఇది 5,020mAh బ్యాటరీ తో, 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తో వస్తుంది.



Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది