Vivo Y30 స్మార్ట్ ఫోన్ ఇండియాలో 5000mAh బ్యాటరీ తో లాంచ్ అయ్యింది. పూర్తి వివరాలు ఇవి..


Vivo Y30 స్మార్ట్ ఫోన్ ఇండియాలో ఈరోజు (2020 జులై 3 న) లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్ , 5000mAh బ్యాటరీ, హోల్ పంచ్ తెరతో, 8-మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా తో వస్తుంది. ఇది ఫ్లిప్ కార్ట్ మరియు Vivo ఈ-స్టోర్ ద్వారా ఈరోజు( 3 జులై 2020 న) రాత్రి 8 గంటల నుండి సేల్ లో పాల్గొననున్నది.

Vivo Y30 స్మార్ట్ ఫోన్ రూ. 14,990 (4GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్) వద్ద లభిస్తుంది. ఈ ఫోన్ Dazzle బ్లూ, ఎమెరాల్డ్ బ్లాక్ అనే రెండు కలర్ వేరియంట్స్ లలో వస్తుంది.

ముందుగా చెప్పుకున్నట్లుగానే ఇది ఫ్లిప్ కార్ట్ మరియు కంపెనీ ఈ-స్టోర్ ద్వారా లభిస్తుంది.


Vivo Y30 స్పెసిఫికేషన్స్:

ఈ స్మార్ట్ ఫోన్ 6.47 అంగుళాల HD+ (720x1560 పిక్సల్స్) LCD తెరతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత FunTouch OS 10 తో, మీడియా టెక్ హీలియో P35 SoC తో, 4 జీబీ RAM మరియు 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. 

మీరు దీనిలో స్టోరేజ్ ను 256 జీబీ వరకు microSD ద్వారా పెంచుకోవచ్చు.

కెమెరా పరంగా దీనిలో వెనుక భాగాన నాలుగు కెమెరాలు( 13MP ప్రైమరీ + 8MP వైడ్ యాంగిల్ + 2MP డెప్త్ సెన్సార్ +2MP మాక్రో సెన్సార్ ) వున్నాయి. దీని ముందు భాగాన 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు.

కనెక్టివిటీ పరంగా దీనిలో 4G LTE, Wi-Fi, బ్లూ టూత్ v5.0, GPS/A-GPS, FM రేడియో, USB టైప్-C మరియు 3.5mm హెడ్ ఫోన్ జాక్ మొదలయినవి వున్నాయి.

దీనిలో ఆక్సిలేరోమేటర్, లైట్, ప్రోక్సీమిటీ, ఈ-కంపాస్, వర్చ్యువల్ గైరో స్కోప్ సెన్సార్ లతో పాటు వెనుక భాగాన సెక్యూరిటీ కొరకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ 5000mAh బ్యాటరీ ను కలిగివుంది.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది