Realme C11 Smartphone Launched in India With 5000mAh Battery: Price and Specifications | in Telugu


Realme C11 స్మార్ట్ ఫోన్ ఇండియాలో ఈరోజు మరొక సారి సేల్ లో పాల్గొననున్నది. ఈ సేల్ రియల్ మీ ఇండియా అధికారిక వెబ్సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు జరుగనున్నది.

ఈ ఫోన్ 2020 జులై 14 న ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మీడియా టెక్ హీలియో G35 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ, వెనుక భాగాన డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. దీని యొక్క ధర మరియు పూర్తి వివరాలను మీరు ఈ క్రింద చదవవచ్చు.

ఈ ఫోన్ యొక్క ధరను కంపెనీ వారు రూ. 7,499 (2GB RAM, 32GB స్టోరేజ్) కు సెట్ చేశారు. ఇది రిచ్ గ్రీన్ మరియు రిచ్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.


Realme C11 స్పెసిఫికేషన్స్:

స్పెసిఫికేషన్స్ పరంగా చూస్తే, Realme C11 స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల HD+(720x1,600 పిక్సెల్స్)  మినీ డ్రాప్ తెరతో, 88.7 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో, 20:9 aspect రేషియో తో వస్తుంది.

ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత Realme UI మీద నడుస్తుంది.

ముందుగా చెప్పుకున్నట్లుగానే దీనిలో మీడియా టెక్ హీలియో G35 SoC ను ఉపయోగించారు. అలానే ఇది 2GB RAM, 32GB స్టోరేజ్ తో వస్తుంది. మీరు దీనిలో స్టోరేజ్ ను microSD కార్డు ద్వారా 256GB వరకు పెంచుకోవచ్చు.

కెమెరా పరంగా చూస్తే దీనిలో వెనుక భాగాన 13-మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా మరియు 2-మెగాపిక్సల్ పోట్రైట్ లెన్స్ అనే రెండు కెమెరాలను గమనించవచ్చు. సెల్ఫీ ల కోసం దీనిలో ముందు భాగాన 5-మెగాపిక్సల్ కెమెరా ను అమర్చారు.

దీనిలో మాగ్నెటిక్ ఇండక్షన్, లైట్, ప్రాక్సిమిటీ మరియు యాక్సిలెరోమీటర్ వంటి మొదలయిన సెన్సార్లు వున్నాయి.

కనెక్టివిటీ పరంగా దీనిలో 4G LTE, Wi-Fi 802.11 b/g/n, బ్లూ టూత్ v5.0, GPS/ A-GPS, మైక్రో USB మరియు 3.5mm హెడ్ ఫోన్ జాక్ మొదలయినవి వున్నాయి. 

ఇక దీనిలో 5000mAh బ్యాటరీ ను ఉపయోగించారు. ఇది రివర్స్ ఛార్జింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది