Redmi 9 Prime Smartphone Launched in India: Price and Specifications in Telugu


Redmi 9 Prime Smartphone Launched in India: Price and Specifications in Telugu



Redmi 9 Prime స్మార్ట్ ఫోన్ 04 ఆగష్టు 2020 న ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్ స్టైల్ తెర, మీడియా టెక్ ప్రాసెసర్, క్వాడ్ రియర్ కెమెరా సెటప్, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తో వస్తుంది. దీని గురించి పూర్తి వివరాలను మీరు ఈ క్రింద చదవవచ్చు.

Redmi 9 Prime స్మార్ట్ ఫోన్ ఇండియాలో రెండు స్టోరేజ్ వేరియంట్ లలో వస్తుంది. దీని 4GB RAM, 64GB వేరియంట్ ధరను కంపెనీ వారు రూ. 9,999 కు మరియు 4GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 11,999 కు సెట్ చేశారు. ఇది Space Blue, Mint Green, Matte Black, మరియు Sunrise Flare అనే నాలుగు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ ఆగష్టు 6 న ఉదయం 10 గంటలకు అమెజాన్ ఇండియాలో, mi.com లో జరుగనున్నది. ఆ తరువాత త్వరలోనే ఇది Mi హోమ్ స్టోర్స్, ప్రముఖ ఆఫ్ లైన్ స్టోర్ లలో కూడా లభ్యం కానున్నది.

స్పెసిఫికేషన్స్ పరంగా చూస్తే, Redmi 9 Prime 6.53-అంగుళాల FHD+(2340x1080 పిక్సెల్స్) IPS తెరతో, 19.5:9 aspect రేషియో తో, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో, P2i స్ప్లాష్ ప్రూఫ్ తో వస్తుంది.

ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత MIUI 11 మీద నడుస్తుంది.

ఇక దీనిలో మీడియా టెక్ హీలియో G80 చిప్ సెట్ ను, Mali-G52 GPU ను ఉపయోగించారు.

ముందుగా చెప్పుకున్నట్లు ఇది గరిష్టంగా 4GB RAM తో, 128GB స్టోరేజ్ తో వస్తుంది. దీనిలోని స్టోరేజ్ ను మీరు 512GB వరకు microSD కార్డు ద్వారా పెంచుకోవచ్చు.

కెమెరా పరంగా దీనిలో వెనుక భాగాన 13-మెగాపిక్సల్ ప్రైమరీ, 8-మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ లెన్స్, 5-మెగా పిక్సెల్ మాక్రో మరియు 2-మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్ అనే నాలుగు కెమెరా లను గమనించవచ్చు. సెల్ఫీల కోసం దీనిలో ముందు భాగాన 8-మెగాపిక్సల్ కెమెరా ను అమర్చారు.

కనెక్టివిటీ పరంగా దీనిలో 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూ టూత్ 5.0, GPS/ A-GPS, IR బ్లాస్టర్ , మరియు USB టైప్-C పోర్ట్ మొదలయినవి వున్నాయి.

దీనిలో అన్ని సాధారణ సెన్సార్ లతో పాటు వెనుక భాగాన ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వుంది.

ఇక ఇది 5,020mAh బ్యాటరీ తో వస్తుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కు సపోర్ట్ చేస్తుంది. అయితే కంపెనీ వారు ఫోన్ తో పాటు కేవలం 10W ఛార్జర్ ను మాత్రమే ప్రొవైడ్ చేస్తారు..



Key Specifications:

డిస్ప్లే: 6.53-అంగుళాల FHD+(2340x1080 పిక్సెల్స్) IPS
OS: ఆండ్రాయిడ్ 10 ఆధారిత MIUI 11
ప్రాసెసర్: మీడియా టెక్ హీలియో G80
GPU: Mali-G52
ఫ్రంట్ కెమెరా: 8MP
రియర్ కెమెరా: 13MP+8MP+5MP+2MP
RAM: 4GB
స్టోరేజ్: 64GB/128GB 
బ్యాటరీ: 5,020mAh 

ధర: 4GB+64GB= Rs. 9,999, 4GB+128GB= Rs. 11,999




Normal Queries for this Post:

Redmi 9 Prime Price and Specifications in Telugu
Redmi 9 Prime Price and Specs in Telugu
Redmi 9 Prime Price in India
Redmi 9 Prime Specifications in Telugu
Redmi 9 Prime Details in Telugu



Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది